బంగాల్లో భారతీయ జనతా పార్టీ(భాజపా) మద్దతుదారుడి భార్యను తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) కార్యకర్తలు హత్య చేశారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. హుగ్లీ జిల్లాలోని గోఘాట్ ప్రాంతంలో సోమవారం రాత్రి 11 గంటలకు ఈ ఘటన జరిగిందని చెప్పారు.
కొందరు వ్యక్తులు సమూహంగా వచ్చి భాజపా కార్యకర్త ఇంట్లోకి చొరబడి, దాడి చేశారని అతడి కుటుంబీకులు చెప్పారు. ఈ క్రమంలో అతడి భార్య మదాబీ అదాక్ అడ్డుకోగా.. ఆమెను తీవ్రంగా గాయపరిచి పరారయ్యారని తెలిపారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆమె మరణించిందన్నారు.
ఈ ఘటన వెనక తృణమూల్ కాంగ్రెస్ హస్తం ఉందని అదాక్ కుటుంబం ఆరోపణలు చేసింది. అయితే.. వీటిని తీవ్రంగా ఖండించింది అధికార పార్టీ.
ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో భాజపా నేతలు ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి: ఉత్తర బంగాల్లో 4.1 తీవ్రతతో భూకంపం