ETV Bharat / bharat

2024 ఎన్నికలే లక్ష్యం- రంగంలోకి మోదీ - భాజపా వార్తలు

2024 సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటేందుకు భాజపా సమాయత్తమవుతోంది. ఇందుకోసం స్వయంగా ప్రధాని మోదీ రంగంలోకి దిగారు. పార్టీ సీనియర్లతో పాటు రాష్ట్రాల సీఎంలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతిపక్షాలకు చెక్​ పెట్టేందుకు రోడ్​మ్యాప్​ను సిద్ధం చేస్తున్నారు. కేబినెట్​ విస్తరణపై చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

BJP starts planning for 2024 election with review meetings
2024 ఎన్నికలే లక్ష్యం- రంగంలోకి మోదీ
author img

By

Published : Jun 16, 2021, 7:17 PM IST

Updated : Jun 16, 2021, 7:24 PM IST

బంగాల్​ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాల అనంతరం భారతీయ జనతా పార్టీ భవిష్యత్​పై దృష్టి సారించింది. వచ్చే ఏడాది పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ, 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తోంది. ఇందుకోసం స్వయంగా ప్రధాని మోదీ రంగంలోకి దిగారు. పార్టీ కీలక నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.

బంగాల్​ అసెంబ్లీ ఎన్నికల్లో.. దిల్లీ సరిహద్దులో రైతుల ఆందోళన, కరోనా సంక్షోభం, ఇంధన ధరల పెరుగుదల.. ఆర్ధిక మందగమనం లాంటి అంశాలు కీలకంగా మారాయి. టీఎంసీ వాటినే ప్రచారస్త్రాలుగా చేసుకొని భాజపాను దెబ్బకొట్టింది.

భవిష్యత్​లో జరిగే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ఆ అవకాశాన్ని మళ్లీ ఇవ్వకుండా ఎలా ముందుకెళ్లాలనే అంశాలపై చర్చించేందుకు.. పార్టీ ముఖ్య నేతలతో పాటు భాజపా పాలిత రాష్ట్రాల సీఎంలతో భేటీ కావాలని ప్రధాని మోదీ నిర్ణయించారు.

అందులో భాగంగానే ఇప్పటికే భాజపా జాతీయ అధ్యక్షుడు నడ్డాతోపాటు హోంశాఖ మంత్రి అమిత్​ షాతో భేటీ అయ్యారు. కేంద్ర మంత్రుల పనితీరుపై సమీక్షించారు. యూపీతోపాటు పలు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు, కేబినెట్​ విస్తరణపై ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్లు సమాచారం.

సువేందు అధికారితో..

భాజపాయేతర రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయడానికి అనుసరించాల్సిన వ్యూహాలను ఆయా రాష్ట్రాల నాయకత్వాలకు వివరించాలని ప్రధాని మోదీ భావించారు. అందులో భాగంగానే సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటేందుకు బంగాల్​లో నిర్మాణాత్మకమైన ప్రతిపక్షాన్ని ఏర్పాటు చేయడం కోసం ఈనెల 9న ఆ రాష్ట్ర భాజపాఎల్పీ నేత సువేందు అధికారితో సమవేశం అయ్యారు. మరోవైపు బంగాల్​ గవర్నర్ జగ్​దీప్ ధన్​కడ్​ ప్రధానిని కలిసేందుకు సిద్ధమయ్యారు.

శివరాజ్​సింగ్​తో..

మధ్యప్రదేశ్​ సీఎం శివరాజ్​ సింగ్​ చౌహాన్​తో బుధవారం ప్రధాని మోదీ సమావేశం అయ్యారు. పార్టీ పరంగా, ప్రభుత్వ పరమైన అంశాలపై చర్చకు వచ్చినట్లు సమాచారం.

అలాగే రైతుల ఆందోళనలతో పాటు రాష్ట్రంలోని కుంభకోణాలపై పంజాబ్ రాష్ట్ర అధ్యక్షుడితో నడ్డా చర్చలు జరిపారు.

"ఇబ్బందుల్లో ఉన్న ప్రభుత్వానికి, పార్టీకి ఇలాంటి సమావేశాలు మేలు చేస్తాయి. భవిష్యత్​లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కేబినెట్​ విస్తరణ అవసరమే. భాజపా ప్రభుత్వం కూడా మంచి పథకాలను అమలు చేస్తోంది. అయితే ప్రతి ఒక్కరూ వాటి ఆవశ్యకతను గుర్తించాలి."

-దేశ్​ రతన్​ నిగమ్​, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు

ప్రధాని మోదీ వరుస సమావేశాలపై భాజపా జాతీయ అధికార ప్రతినిధి సుదేష్ వర్మ స్పందించారు. ఈ సమావేశాలు ఎప్పటికప్పుడు జరుగుతాయని, ఏ ప్రభుత్వానికైనా ఇవి అవసరం అన్నారు.

ఇదీ చూడండి: పీకే-ఐప్యాక్​ అస్త్రంతో భాజపాపై మళ్లీ దీదీ గురి!

Last Updated : Jun 16, 2021, 7:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.