ETV Bharat / bharat

'భాజపా పుంజుకుంటోంది.. కాంగ్రెస్​ కనుమరుగవుతోంది'

దేశంలో ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భాజపాకే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్ అన్నారు. కాంగ్రెస్ మాత్రం​ కనుమరుగవుతోందన్నారు. ప్రస్తుతం దేశంలోని చాలా పార్టీలు కుటుంబ పార్టీలని, భాజపాకు మాత్రం పార్టీయే కుటుంబం అన్నారు.

BJP 'rising,' Congress 'diminishing,' says Javadekar
'భాజపా పుంజుకుంటోంది.. కాంగ్రెస్​ కనుమరుగవుతోంది'
author img

By

Published : Dec 26, 2020, 6:21 AM IST

ఇటీవల దేశంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు, ఉపఎన్నికలు, మరే ఇతర ఎన్నికల్లో అయినా భాజపా విజయదుందుభి మోగించిందని హర్షం వ్యక్తం చేశారు కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్​. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రజలు ఎంతగా విశ్వసిస్తున్నారో చెప్పేందుకు ఈ ఫలితాలే నిదర్శనమన్నారు. దేశంలో కాంగ్రెస్​ పార్టీ కనుమరుగైపోయే పరిస్థితి తలెత్తిందని వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం దేశంలోని చాలా పార్టీలు కుటుంబ పార్టీలే అని జావడేకర్​ అన్నారు. తమకు మాత్రం భాజపా పార్టీయే కుటుంబమని చెప్పారు.

రాజస్థాన్​, గోవా, హైదరాబద్​లో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో భాజపాకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని జావడేకర్​ అన్నారు. కాంగ్రెస్​ పార్టీని ప్రజలు తిరస్కరించారని పేర్కొన్నారు. రాజస్థాన్​లో 21 జిల్లా పరిషత్​లకు గాను భాజపా 13 స్థానాలు కైవసం చేసుకుందని, అక్కడ 20 ఏళ్లుగా అధికార పార్టీనే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం వరిస్తున్నా ఈసారి ట్రెండ్ మారిందని వివరించారు. హైదరాబాద్​లో గత జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో 4 స్థానాలకే పరిమితమైన భాజపా, ఈసారి 48 స్థానాలు గెలుచుకుందని గుర్తు చేశారు. గోవా, యూపీ, మధ్యప్రదేశ్​, మణిపుర్​, గుజరాత్.. ఇలా ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా భాజపానే ప్రజలు ఆదరిస్తున్నారని చెప్పారు.

జమ్ముకశ్మీర్​లో ఇటీవల జరిగిన డీడీసీ ఎన్నికల్లో భాజపా సత్తా చాటిందని, లోయలో అతిపెద్ద పార్టీగా అవతరించిందని జావడేకర్​ అన్నారు.

సీఎం అభ్యర్థిపై మౌనం..

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఏఐఏడీఎంకేతో భాజపా పొత్తుపై ఇంకా స్పష్టత లేదు. కూటమి తరఫున సీఎం అభ్యర్థి పళనిస్వామే అని ఏఐఏడీఎంకే ఇప్పటికే ప్రకటించింది. అయితే ఈ విషయంపై స్పందించేందుకు జావడేకర్​ నిరాకరించారు. తమిళనాడు భాజపా నేతలు మాత్రం సీఎం అభ్యర్థి ఎవరనేది పార్టీ అధిష్ఠానం నిర్ణయిస్తుందని చెబుతున్నారు.

నాలుగు మీడీయా యూనిట్లను నేషన్​ల్ ఫిల్మ్​ డెవలప్​మెంట్​ కార్పొరేషన్​లో విలీనం చేసేందుకు కేంద్రం ఆమోదం తెలపడంపై జావడేకర్ స్పందించారు. దీనిని ఉపసంహరించుకునే అవకాశమే లేదని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: 'ఆ విషయంలో మోదీ పక్కదారి పట్టిస్తున్నారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.