ETV Bharat / bharat

వారసత్వానికి నో.. భాజపాకే జై.. పనాజీలో పారికర్​ ఓటమి - ఉత్పల్​ పారికర్

Goa Election Result: పనాజీలో దివంగత నేత మనోహర్​ పారికర్​ కుమారుడు ఉత్పల్​ పారికర్​పై భాజపా అభ్యర్థి విజయం సాధించారు. ఎన్నికలకు ముందు భాజపాతో విభేదాలు తలెత్తిన నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్థిగా ఉత్పల్​ బరిలో నిలిచారు.

BJP retains in Panaji
ఉత్పల్​ పారికర్
author img

By

Published : Mar 10, 2022, 3:01 PM IST

Goa Election Result: గోవాలోని పనాజీ మళ్లీ భాజపా సొంతమైంది. స్వతంత్ర అభ్యర్థి, దివంగత నేత మనోహర్​ పారికర్​ కుమారుడు ఉత్పల్​ పారికర్​పై భాజపా అభ్యర్థి అటనాసియో మొన్సెరేట్​​ విజయం సాధించారు. దీంతో ఆ పార్టీ వర్గాలు సంబరాలు చేసుకుంటున్నాయి. మరోవైపు భాజపాతో విభేదాల కారణంగా స్వతంత్రంగా పోటీ చేసిన ఉత్పల్​కు నిరాశే మిగిలింది.

"స్వతంత్ర అభ్యర్థిగా మంచి పోటీ ఇచ్చాను. ఈ సందర్భంగా నేను ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భాజపాపై పోటీ జరిగిన విధానం సంతృప్తిని ఇచ్చినా.. ఫలితాలు కాస్త నిరాశ కలిగించాయి."

-ఉత్పల్​ పారికర్​, స్వతంత్ర అభ్యర్థి

తండ్రి పోటీ చేసిన చోటే గెలవాలని..

ఈ ఎన్నికల్లో తనకు పనాజీ టికెట్​ దక్కుతుందని భావించిన ఉత్పల్​ పారికర్​కు భాజపా షాకిచ్చింది. ఆ నియోజకవర్గంలో సిట్టింగ్​ ఎమ్మెల్యేకే అవకాశం కల్పించింది. అయితే ఉత్పల్​ పోటీ చేసేందుకు భాజపా మరో రెండు స్థానాలను ప్రతిపాదించినా ఆయన అందుకు తిరస్కరించారు. తన తండ్రి ఎమ్మెల్యేగా పోటీ చేసిన స్థానంలోనే బరిలో నిలవాలని ఉత్పల్​ భావించారు. దీంతో ఉత్పల్​ భాజపాను వీడారు. తమ పార్టీలో చేరమని ఆమ్​ఆద్మీ చేసిన ఆఫర్​ను కూడా ఉత్పల్​ తిరస్కరించి ఎన్నికల బరిలో స్వతంత్రంగా పోటీ చేశారు. కానీ ఆయనకు నిరాశే మిగిలింది.

ఇదీ చూడండి : పాపం కాంగ్రెస్​.. యూపీలో 'సింగిల్​ సీటు' కోసం ఆపసోపాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.