ETV Bharat / bharat

'పార్లమెంట్​ను అవమానించేలా విపక్షాల తీరు'

పెగసస్ వ్యవహారంపై పార్లమెంటులో విపక్షాల తీరును తీవ్రంగా తప్పుబట్టారు ప్రధాని నరేంద్ర మోదీ. వారి వ్యవహార శైలి.. పార్లమెంటును, రాజ్యాంగాన్ని అవమానించేలా ఉందని భాజపా పార్లమెంటరీ పార్టీ భేటీలో మండిపడ్డారు.

BJP, leaders meet
భాజపా, నేతల భేటీ
author img

By

Published : Aug 3, 2021, 11:41 AM IST

Updated : Aug 3, 2021, 2:41 PM IST

పార్లమెంట్​లో విపక్షాల చేస్తున్న నిరసనలను ప్రధాని నరేంద్ర మోదీ తప్పుబట్టారు. పెగసస్​ వ్యవహారంపై చర్చకు పట్టుబట్టిన నేపథ్యంలో సభా కార్యకలాపాలు నిలిచిపోతుండటంపై మండిపడ్డారు. సభలో బిల్లులు ఆమోదించే సమయంలో విపక్ష సభ్యులు పేపర్లను చింపివేయడం, అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం లాంటివి పార్లమెంట్​, రాజ్యాంగాన్ని హేళన చేయడమేనని అన్నారు. భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈమేరకు మాట్లాడారు.

BJP, leaders meet
భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశం

వైద్య, దంత కళాశాలల్లో ఓబీసీ కోటాకు ప్రభుత్వం ఆమోదం తెలపడాన్ని భాజపా పార్లమెంటరీ పార్టీ స్వాగతించినట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషీ తెలిపారు. పార్లమెంటులో బిల్లులను చర్చించకుండానే ఆమోదించడంపై తృణమూల్‌ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ చేసిన వ్యాఖ్యలను ప్రధాని తప్పుబట్టినట్లు జోషి వెల్లడించారు.

BJP, leaders meet
సమావేశానికి హాజరైన నేతలు

పార్లమెంటులో బిల్లుల ఆమోదం చాట్‌ తయారు చేయడమా అంటూ డెరెక్‌ వ్యాఖ్యలు చేయడం.. ఎంపీలను ఎన్నుకున్న ప్రజల్ని అవమానించడమేనని మోదీ అన్నట్లు ప్రహ్లాద్‌ జోషి తెలిపారు. సభలో పేపర్లు చించి విసరడం, తమ వైఖరికి క్షమాపణ కూడా చెప్పకపోవడం అహంకారమని ప్రధాని చెప్పినట్లు జోషి వివరించారు.

ఇదీ చదవండి:రాహుల్​గాంధీ ఆధ్వర్యంలో విపక్ష నేతల భేటీ

Last Updated : Aug 3, 2021, 2:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.