భాజపా ఎంపీ రామ్ స్వరూప్ శర్మ (62) దిల్లీలోని ఆయన ఫ్లాట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. హిమాచల్ ప్రదేశ్లోని మండీ నుంచి ఆయన లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
వ్యక్తిగత సిబ్బంది ఇచ్చిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. ఆయన తన గదిలో ఉరేసుకున్నట్లు గుర్తించారు. ఆ గది లోపలి నుంచి గడియపెట్టి ఉన్నట్లు తెలిపారు. ప్రాథమికంగా ఆయనది ఆత్మహత్యగా అనుమానిస్తున్నట్లు పేర్కొన్నారు పోలీసులు. అయితే పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాత ఆయన మృతిపై మరింత స్పష్టత వస్తుందని చెప్పారు.