ఒడిశాలోని భాజపా ఎమ్మెల్యే సుభాశ్ పాణిగ్రాహి శాసనసభలోనే ఆత్మహత్యకు యత్నించారు. వ్యవసాయ మండీల(మార్కెట్) సమస్యను ప్రస్తావిస్తూ సభలోనే శానిటైజర్ తాగారు. వెంటనే పక్కనున్న సభ్యులు అడ్డుకున్నారు.
మండీల దుర్వినియోగం, ధాన్యం సేకరణ, టోకెన్ వ్యవస్థలో లోపాలు పరిష్కరించడంలో రాష్ట ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు దేవగడ్ ఎమ్మెల్యే పాణిగ్రాహి. సభలో పౌర సరఫరాల శాఖ మంత్రి రనేంద్ర ప్రతాప్ మాట్లాతుండగా.. పాణిగ్రాహి శానిటైజర్ తాగడానికి ప్రయత్నించారు. దీంతో పక్కనే ఉన్న ఇతర మంత్రులు అడ్డుకున్నారు.
అంతకుముందు.. రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల ఉదాసీనతను నిరసిస్తూ.. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించారు పాణిగ్రాహి. "ఈ పరిస్థితుల్లో ఇంతకుమించిన ప్రత్యామ్నాయం లేదు. ప్రభుత్వం, సభ రైతులపై శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది" అని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: 'బలగాల ఉపసంహరణతో సత్ఫలితాలు'