కర్ణాటక హొన్నల్లి భాజపా ఎమ్మెల్యే రేణుకాచార్య.. కరోనా కష్టకాలంలో ఎంతోమందికి సాయం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. ఇప్పుడు ఓ కొవిడ్ మృతదేహానికి స్వయంగా అంత్యక్రియలు నిర్వహించి ప్రశంసలు అందుకుంటున్నారు.


దేవనగరి జిల్లా హొన్నల్లి తాలుకాలోని ఓ గ్రామానికి చెందిన 31 ఏళ్ల యువకుడు ఇటీవలే కరోనా బారినపడ్డాడు. అతడిని ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు రేణుకాచార్య. అనంతంరం కొద్ది గంటలకే ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. అతడి మృతదేహాన్ని ఊళ్లోకి తీసుకెళ్లేందుకు గ్రామస్థులు నిరాకరించారు. దీంతో వారికి సర్దిచెప్పిన రేణుకాచార్య.. యువకుడి మృతదేహాన్ని అంబులెన్స్‌లో స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ శ్మశానానికి తీసుకెళ్లారు. అంతా తానై అంత్యక్రియలు నిర్వహించారు.
ఎమ్మెల్యే మానవతా దృక్పథాన్ని నియోజకవర్గ ప్రజలంతా కొనియాడుతున్నారు.
ఇదీ చూడండి: Covid: 2 నెలల్లో 17వేల మంది పిల్లలకు వైరస్!