కేరళలో భారతీయ జనతా పార్టీ గెలుపుపై ధీమాగా ఉన్నారు 'మెట్రో మ్యాన్' శ్రీధరన్. తమ పార్టీ రాష్ట్రంలో కింగ్‌మేకర్‌గా అవతరిస్తుందని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి మలంపులలో హోమంత్రి అమిత్‌షా రోడ్‌షోలో శ్రీధరన్ పాల్గొన్నారు.
"కేరళలో భాజపాకు పూర్తి మెజారిటీ వస్తుంది. లేదా కింగ్‌మేకర్‌గా అవరించడానికి కావాల్సిన సంఖ్యాబలం అయినా లభిస్తుంది. ఎల్డీఎఫ్, యూడీఎఫ్‌లతో విసుగుచెందిన ప్రజలకు భాజపా రూపంలో ప్రత్యామ్నాయం దొరికింది. వారు తప్పక మాకే ఓటేస్తారు."
- శ్రీధరన్, భాజపా నేత
రాష్ట్రంలో ఎన్డీయే అధికారంలోకి వస్తే.. పరిశ్రమలు, ఉద్యోగాల కల్పనపై దృష్టిసారిస్తామని శ్రీధరన్ తెలిపారు. విద్యావ్యవస్థ మెరుగుపరుస్తానన్నారు. పారదర్శక, సమర్థవంతమైన, అవినీతి రహిత పాలన అందిస్తానని చెప్పారు.
ఇదీ చూడండి: 'కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ సంప్రదాయానికి బ్రేక్'