ETV Bharat / bharat

'రైతులకు ఉచిత కరెంట్.. 'లవ్ జిహాద్' దోషులకు పదేళ్లు జైలు'

UP BJP Manifesto: ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునే మేనిఫెస్టోతో భాజపా ముందుకొచ్చింది. రాజధాని లఖ్‌నవూలో లోక్‌ కల్యాణ్ సంకల్ప పత్ర పేరిట భాజపా అగ్రనేత అమిత్‌ షా యూపీ వాసులపై హామీల వర్షం కురిపించారు. అన్నదాతలు, నిరుద్యోగులు, మహిళా సంక్షేమంపై ఆ పార్టీ గురిపెట్టింది. రైతుల కోసం ఉచిత విద్యుత్‌, ప్రతి కుటుంబంలో కనీసం ఒకరికి ఉద్యోగం ఇస్తామంటూ వరాలిచ్చింది. లవ్‌ జిహాద్‌కు పాల్పడే వారికి 10 ఏళ్ల జైలుశిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తామని తెలిపింది.

భాజపా ఎన్నికల మ్యానిఫెస్టో
BJP UP ELECTIONS MANIFESTO
author img

By

Published : Feb 8, 2022, 12:52 PM IST

Updated : Feb 8, 2022, 3:07 PM IST

UP BJP Manifesto: ఉత్తర్​ప్రదేశ్ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ 'లోక్‌ కళ్యాణ్ సంకల్ప పత్ర' పేరిట మేనిఫెస్టో విడుదల చేసింది. ఈ సందర్భంగా అమిత్‌ షా మాట్లాడుతూ ఇది కేవలం ప్రకటన పత్రం కాదని, ఇది యూపీ ప్రభుత్వ తీర్మానమని వ్యాఖ్యానించారు. 2017లో ఇచ్చిన 212 హామీల్లో 92 శాతం నేరవేర్చామన్న ఆయన తాము చెప్పిందే చేస్తామని వెల్లడించారు.

యూపీలో తిరిగి అధికారంలోకి వస్తే వచ్చే ఐదేళ్లలో రాష్ట్ర తలసరి ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని షా హామీ ఇచ్చారు. రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్ల వరకు పెట్టుబడులను రప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్లు మేనిఫెస్టోలో వివరించారు. వచ్చే ఐదేళ్ల కాలంలో మూడు కోట్ల కొత్త ఉద్యోగాలు కల్పిస్తామని, ప్రతి కుటుంబంలో కనీసం ఒక్కరికి ఉద్యోగం లభించేలా చూస్తామని చెప్పారు.

అన్నదాతల కోసం...

  • సాగునీటి కోసం రైతులకు ఉచిత విద్యుత్.
  • గోధుమ, వరి పంటకు కనీస మద్దతు ధర.
  • చక్కెర మిల్లుల పునరుద్ధరణకు రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తామని హామీ.
  • వచ్చే 15 ఏళ్లలో చెరుకు సంబంధిత బకాయిల మాఫీ.

విద్య- వైద్యం

  • అన్ని జిల్లాల్లో మెరుగైన వైద్య సామగ్రితో ప్రభుత్వ ఆస్పత్రుల ఏర్పాటు.
  • రాణీ లక్ష్మీబాయి పథకం కింద మంచి మార్కులు సాధించే విద్యార్థినులకు ఉచిత స్కూటర్లు.
  • స్వామి వివేకానంద యువ సశక్తికరణ్‌ యోజన కింద 2 కోట్ల ట్యాబ్‌లు, స్మార్ట్‌ఫోన్లు ఉచితంగా పంపిణీ.

సంక్షేమం

  • ఉజ్వల యోజన కింద హోలీ, దీపావళి పండుగలకు దారిద్ర్య రేఖ దిగువన ఉండే కుటుంబాల్లో మహిళలకు రెండు ఉచిత ఎల్‌పీజీ సిలిండర్లు
  • 60 ఏళ్లు పైబడిన మహిళలకు ప్రజా రవాణాలో ఉచిత ప్రయాణం
  • వితంతువులు, వృద్ధులు, దివ్యాంగుల ఫించన్ల పెంపు
  • పట్టణ పేదలకు తక్కువ ధరకు ఆహారం 'మా అన్నపూర్ణ క్యాంటీన్'ల ఏర్పాటు
  • కన్యా సుమంగళ యోజన కింద ఇచ్చే మొత్తం రూ.25 వేలకు పెంపు
  • లవ్‌ జిహాద్‌కు పాల్పడితే పదేళ్ల జైలుశిక్ష సహా రూ.లక్ష జరిమానా

ఇదీ చదవండి: భాజపాకు గుడ్​బై.. కాంగ్రెస్​ గూటికి త్రిపుర ఎమ్మెల్యేలు

Last Updated : Feb 8, 2022, 3:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.