ETV Bharat / bharat

'భాజపా ఉచిత రేషన్​ హామీ.. ఓ పెద్ద అబద్ధం' - mamata benarjee in election rally

బంగాల్​లో ఉచిత రేషన్​ ఇస్తామని భాజపా తప్పుడు వాగ్దానాలు చేస్తోందని తృణమూల్​ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ఆ హామీని భాజపా ఎన్నటికీ నెరవేర్చదని వ్యాఖ్యానించారు. ఏదో ఒకరోజు దేశం పేరును మోదీ పేరుగా మారుస్తారని అన్నారు.

mamata benarjee in election rally
'భాజపా ఉచిత రేషన్​ హామీ.. ఓ పెద్ద అబద్ధం'
author img

By

Published : Mar 22, 2021, 3:13 PM IST

బంగాల్​లో అసెంబ్లీ ఎన్నికల వేళ ఉచిత రేషన్​ ఇస్తామంటూ భాజపా తప్పుడు వాగ్దానాలు చేస్తోందని తృణమూల్​ కాంగ్రెస్ అధినేత్రి, బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. ఆ హామీని భాజపా ఎన్నటికీ నెరవేర్చలేదని అన్నారు.

బంకురా జిల్లా కొతుల్​పుర్​లో ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. 'భాజపా.. బయటి వ్యక్తుల పార్టీ' అని ఆమె ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఉగ్రవాదాన్ని సృష్టించేందుకు ఆ పార్టీ గూండాలను తయారు చేస్తోందని ఆరోపించారు.

" ఉచిత రేషన్ ఇస్తామంటూ భాజపా తప్పుడు హామీలు ఇస్తోంది. దాన్ని భాజపా ఎన్నటికీ నెరవేర్చదు. మిమ్మల్ని ఓటు వేయాలని అడిగేందుకు భాజపా రౌడీలు మీ ఇంటికి వస్తారు. వాళ్లు మిమ్మల్ని భయపెడితే.. ఇంట్లో ఉన్న పాత్రలను పట్టుకుని, వాళ్లను తరిమిగొట్టేందుకు సిద్ధంగా ఉండండి."

-మమతా బెనర్జీ, తృణమూల్​ కాంగ్రెస్ అధినేత్రి

మహిళలు ఏం తినాలో, ఏ బట్టలు వేసుకోవాలో భాజపా ఆదేశాలిస్తోందని మమత దుయ్యబట్టారు. అంబేద్కర్​ కంటే నరేంద్ర మోదీనే గొప్ప వ్యక్తి అని భావించేలా ప్రజల ఆలోచనను మారుస్తారని అన్నారు.

"గుజరాత్​లోని ఓ స్టేడియం పేరును మోదీ స్టేడియంగా మార్చారు. ఏదో ఓ రోజు ఈ దేశం పేరును కూడా వాళ్లు మారుస్తారు. ప్రభుత్వం రంగ సంస్థలను ప్రైవేట్​పరం చేస్తున్నారు." అని మమత ఆరోపించారు.

ఇదీ చూడండి:'ఆ కుటుంబం అసలు రంగును గుర్తించలేకపోయా'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.