ETV Bharat / bharat

భాజపా నేత దారుణ హత్య.. ఇంటి ముందే నాలుగు రౌండ్ల కాల్పులు జరిపి.. - దిల్లీ వార్తలు తాజా

BJP Leader Shot Dead: దిల్లీలో భాజపా నేత దారుణ హత్యకు గురయ్యారు. గాజీపుర్​ ప్రాంతంలోని అతని నివాసం వద్దే గుర్తుతెలియని వ్యక్తులు బైక్​పై వచ్చి కాల్చి చంపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

BJP Leader Shot Dead
కాల్పులు
author img

By

Published : Apr 21, 2022, 4:17 AM IST

BJP Leader Shot Dead: దిల్లీలోని గాజీపుర్​ ప్రాంతంలో ఓ భాజపా నేత హత్యకు గురయ్యారు. మృతుడు మయూర్​ విహార్​ జిల్లా భాజపా యూనిట్​కు సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్న జీతూ చౌదరీగా పోలీసులు గుర్తించారు. ఘటనాస్థలం నుంచి ఖాళీ క్యాట్రిడ్జులు సహా పలు కీలక ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్​ల ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

BJP Leader Shot Dead
భాజపా నేత కాల్పులకు గురైన ప్రాంతం

పోలీసుల వివరాలు ప్రకారం.. మయుర్​ విహార్​ ప్రాంతంలో నివసించే జీతూ చౌదరీ బుధవారం రాత్రి తన ఇంటి బయటకు వచ్చి నిల్చున్నాడు. అదే సమయంలో బైక్​పై ఇద్దరు దుండగులు వచ్చి జీతూపై నాలుగు రౌండ్లు కాల్పులు జరిపి పరారయ్యారు. ఈ క్రమంలో తల, కడుపు భాగాల్లోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. ఈ ఘటన రాత్రి సుమారు 8.15 గంటలకు జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. కాల్పులకు గురైన జీతూను అక్కడి స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధరించారు. ఈ కాల్పులకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు.

ఇదీ చూడండి : పెళ్లి పేరుతో మోసం.. తల్లీకూతుళ్లపై గ్యాంగ్​ రేప్.. 2 నెలల చిన్నారిపైనా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.