ETV Bharat / bharat

'ఖర్గే ఫ్యామిలీని హత్య చేసేందుకు బీజేపీ కుట్ర.. మోదీ మౌనం ఎందుకు?'

కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హత్యకు బీజేపీ కుట్ర పన్నిందని ఆ పార్టీ ఆరోపించింది. సంబంధిత ఆడియో క్లిప్‌ను విడుదల చేసింది. ఖర్గేతో పాటు ఆయన కుటుంబసభ్యులను హత్య చేసేందుకు బీజేపీ నేతలు కుట్ర పన్నుతున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్‌ సూర్జేవాలా ఆరోపించారు. చిత్తాపుర్ బీజేపీ అభ్యర్థి ఆడియో టేపుల ద్వారా ఈ విషయం స్పష్టమైందని ఆయన పేర్కొన్నారు.

Mallikarjun Kharge and family
Mallikarjun Kharge and family
author img

By

Published : May 6, 2023, 12:58 PM IST

Updated : May 6, 2023, 2:10 PM IST

కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఆయన కుటుంబసభ్యులను హత్య చేసేందుకు బీజేపీ నేతలు కుట్ర పన్నుతున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్‌ సూర్జేవాలా ఆరోపించారు. చిత్తాపుర్ బీజేపీ అభ్యర్థి ఆడియో టేపుల ద్వారా ఈ విషయం స్పష్టమైందని ఆయన పేర్కొన్నారు. ఇటీవల భాజపా ఎమ్మెల్యే మదన్ దిలావర్‌ కూడా ఖర్గేను హత్య చేస్తామని హెచ్చరించారని వెల్లడించారు. ఈ విషయంలో బీజేపీ ఎందుకు మౌనంగా ఉంటోందని ఆయన ప్రశ్నించారు.

"ఓటమి భయంతో బీజేపీ ఏ స్థాయికి దిగజారిందంటే.. ప్రధాని మోదీ, సీఎం బొమ్మై అనుచరుడు, చిత్తాపుర్ బీజేపీ అభ్యర్థి.. ఖర్గే, ఆయన కుటుంబసభ్యుల హత్యకు కుట్ర పన్నినట్లు ఆడియో టేపుల ద్వారా దొరికిపోయారు. కర్ణాటకలోని ఓ దళిత కుటుంబంలో, పరిశ్రమలో కూలీ పనిచేసుకుని బతికే వారి ఇంటిలో పుట్టిన మల్లిఖార్జున ఖర్గే.. కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎలా అయ్యారని.. బీజేపీ జీర్ణించుకోలేకపోతోంది. ఇది కర్ణాటక స్వాభిమానాన్ని హత్య చేసేందుకు జరిగిన కుట్ర. ఖర్గే హత్యకు కుట్ర విషయంలో మోదీ, కర్ణాటక పోలీసులు, ముఖ్యమంత్రి బస్వరాజ్‌ బొమ్మై, ఎన్నికల సంఘం మౌనంగా ఉన్నా.. కర్ణాటక ప్రజలు మౌనంగా ఉండరు."

- రణదీప్‌ సూర్జేవాలా, కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి

ఖర్గేను హత్య చేసేందుకు కుట్ర పన్నారన్న కాంగ్రెస్ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై చెప్పారు. అది నిజమని తేలితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఖర్గే హత్యపై బీజేపీ అభ్యర్థి ఆడియో టేపుల వ్యవహారంలోనూ నిజానిజాలు తేల్చాల్సి ఉందన్నారు. "ఈ అంశాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం.మొత్తం వ్యవహారంపై విచారణ జరిపిస్తాం." అని బొమ్మై తెలిపారు.

మోదీపై ఖర్గే తీవ్ర విమర్శలు
ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్​ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ విష సర్పం లాంటి వారని మల్లిఖార్జున ఖర్గే ఆరోపించారు. "ఆ పాముకు విషం ఉందో లేదోనని మీరు అనుకోవచ్చు. ఒకవేళ దానిని టచ్​ చేస్తే.. మీరు చనిపోతారు" అని ఖర్గే ఆరోపణలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారానికి దారితీశాయి. కర్ణాటక ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు, బీజేపీ శ్రేణులు ఖర్గే వ్యాఖ్యలపై తీవ్రంగా ధ్వజమెత్తారు. కాంగ్రెస్​ పార్టీతో పాటు ఖర్గే దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆయన చేసిన వ్యాఖ్యలపై ఖర్గే వివరణ ఇచ్చుకున్నారు.

ఖర్గే వివరణ..
తాను చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు రావడం వల్ల.. వాటిపై మల్లిఖార్జున ఖర్గే వివరణ ఇచ్చుకున్నారు. ఈ వ్యాఖ్యలు ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కాదన్నారు. కేవలం బీజేపీ భావజాలాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలేన్నారు. "బీజేపీ భావజాలం పాము లాంటిది. దాన్ని ముట్టుకునే ప్రయత్నం చేస్తే చనిపోయే ప్రమాదం ఉంది" అని తాను అన్నానని ఖర్గే సృష్టం చేశారు. తాను మోదీకి వ్యతిరేకంగా మాట్లాడలేదన్న ఖర్గే.. తాను వ్యక్తిగతంగా ఎవరిని కించపరిచేలా మాట్లాడని ఇంతకముందే చెప్పానని గుర్తు చేశారు.

ఇవీ చదవండి : మనిషితో చిలుక ఫ్రెండ్​షిప్​.. ఎక్కడికి వెళ్లినా ఆయనతోనే.. బైక్​పై ఆఫీస్​కు కూడా!

నుదిటిపై సింధూరం పెట్టకుండా ముఖంపై చల్లిన వరుడు.. పెళ్లి క్యాన్సిల్​ చేసుకున్న వధువు!

Last Updated : May 6, 2023, 2:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.