కొత్త సాగు చట్టల రద్దు విషయంలో కేరళలో నాటకీయ పరిణామం జరిగింది. వ్యవసాయ చట్టాల రద్దు తీర్మానానికి ఆ రాష్ట్రంలో భాజపాకు ఉన్న ఒక్క ఎమ్మెల్యే అనూకూలంగా ఓటేశారని వార్తలు వచ్చాయి. అయితే తాను అలా అనలేదని భాజపా కేరళ ఎమ్మెల్యే ఓ రాజగోపాల్ తెలిపారు. తాను ఓటింగ్‌కు దూరంగా ఉన్నానని ఆయన తెలిపారు.
"నూతవ సాగు చట్టాల రద్దుకు అధికార ఎల్డీఎఫ్ ప్రవేశ పెట్టిన తీర్మానంలోని కొన్ని అంశాలను వ్యతిరేకించాను. కానీ సభ ముందుకు వచ్చిన ఏకగ్రీవ తీర్మానాన్ని వ్యతిరేకించలేదు. సాగు చట్టాల వల్ల రైతులకు మేలే జరుగుతుంది. కేంద్రం తెచ్చిన ఈ చట్టాల్ని నేను వ్యతిరేకించలేదు. అలా వస్తున్న వార్తలన్నీ నిజాలు కావు."
-ఓ రాజగోపాల్, కేరళలో భాజపా ఎమ్మెల్యే
కొత్త వ్యవసాయ చట్టాల రద్దును కోరుతూ కేరళ అసెంబ్లీలో వామపక్ష ప్రభుత్వం ప్రవేశ పెట్టిన తీర్మానం ఉదయం ఆమోదం పొందింది.
ఇదీ చూడండి: సాగు చట్టాల ఉపసంహరణకు 'కేరళ' తీర్మానం