ETV Bharat / bharat

'లోక్​సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ'.. బీజేపీతో పొత్తుపై దేవెగౌడ క్లారిటీ - కర్ణాటక ఎన్నికల ఫలితాలు

BJP JDS Alliance Karnataka : కర్ణాటకలో పొత్తులపై జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని హెచ్​డీ దేవెగౌడ స్పందించారు. వచ్చే లోక్​సభ ఎన్నికల్లో ఒంటరిగానే జేడీఎస్ బరిలో దిగుతుందని స్పష్టం చేశారు.

bjp jds alliance
bjp jds alliance
author img

By

Published : Jul 25, 2023, 2:20 PM IST

Updated : Jul 25, 2023, 4:09 PM IST

BJP JDS Alliance Karnataka : కర్ణాటకలో జేడీఎస్​, బీజేపీ పొత్తుపై స్పందించారు జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని హెచ్​డీ దేవెగౌడ. 2024 లోక్‌సభ ఎన్నికల్లో జేడీఎస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. 'నేను చాలా స్పష్టంగా చెబుతున్నా. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదు. వచ్చే లోక్​సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తాం. జేడీఎస్​ కార్యకర్తలతో సంప్రదించి.. పార్టీ బలంగా చోట్ల మాత్రమే అభ్యర్థులను లోక్​సభ ఎన్నికల్లో బరిలో నిలుపుతాం' అని దేవెగౌడ చెప్పారు. విపక్షాల కూటమికి ఆహ్వానం అందకపోవడంపై ప్రశ్నించగా.. కర్ణాటక కాంగ్రెస్​లోని ఓ వర్గం నేతలు తమను అడ్డుకున్నారని చెప్పారు.

  • #WATCH | Bengaluru: On alleged alliance between JDS and BJP in Karnataka, JDS chief HD Devegowda says, "Let me be very clear. There is no question of aligning with anybody, we will fight the battle independently on our own." pic.twitter.com/ok1lxJivzl

    — ANI (@ANI) July 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"2024 లోక్​సభ ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. ఒక స్థానమా లేదా రెండా? ఆరు సీట్లు గెలుస్తామా అన్నది పక్కనపెడితే.. వచ్చే ఎన్నికల్లో మాత్రం కచ్చితంగా ఒటంరిగానే పోటీ చేస్తాం. ఈ పరిస్థితులపై పార్టీలో చర్చించి సరైన నిర్ణయం తీసుకుంటాం."
--దేవెగౌడ, జేడీఎస్​ అధినేత

బీజేపీతో కలిసి కాంగ్రెస్​కు వ్యతిరేకంగా తమ పార్టీ పనిచేస్తుందని ఇటీవలే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ అగ్రనేత కుమారస్వామి చెప్పారు. కర్ణాటకలో బీజేపీతో కలిసి ప్రతిపక్షంగా పనిచేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. బీజేపీతో జట్టు కట్టే విషయంలో.. తుది నిర్ణయం తీసుకునే అధికారం జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని హెచ్​డీ దేవెగౌడ తనకు అప్పగించినట్లు తెలిపారు. దీంతో వచ్చే ఏడాది జరిగే లోక్​సభ ఎన్నికల్లో జేడీఎస్​-బీజేపీ పొత్తు ఉంటుందని ఊహాగానాలు వచ్చాయి. తాజాగా దేవెగౌడ చేసిన వ్యాఖ్యలతో పొత్తు ఖరారు కానట్లు తెలుస్తోంది.

కాగా, 2019 లోక్​సభ ఎన్నికల్లో జేడీఎస్​, కాంగ్రెస్ కలిసి పనిచేశాయి. మొత్తం 28 స్థానాలకు గాను బీజేపీ 25 సీట్లను కైవసం చేసుకోగా.. కాంగ్రెస్, జేడీఎస్​ అభ్యర్థులు చెరో స్థానంలో గెలిచారు. మరో స్థానంలో బీజేపీ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో తుమకూరు నుంచి పోటీ చేసిన దేవెగౌడ సైతం ఓటమి పాలయ్యారు.

Karnataka Election 2023 Result : ఈ ఏడాది మే నెలలో కర్ణాటక శాసనసభ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ, జేడీఎస్, కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేశాయి. కర్ణాటక ఎన్నికల్లో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకుగాను కాంగ్రెస్‌ పార్టీ 135 నియోజకవర్గాల్లో జయకేతనం ఎగురవేసింది. భారతీయ జనతా పార్టీ 66 సీట్లు, మాజీ ప్రధాని దేవెగౌడ సారథ్యంలోని జేడీఎస్ 19 స్థానాలు గెలుపొందాయి. దీంతో కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ బాధ్యతలు స్వీకరించారు.

ఇవీ చదవండి : కర్ణాటకలో కుదిరిన దోస్తీ.. జేడీఎస్​-బీజేపీ పొత్తు ఖరారు

బీజేపీతో జట్టుకట్టేందుకు జేడీఎస్ తహతహ! విపక్షాలపై విమర్శలు.. '2024' కోసమే!

Last Updated : Jul 25, 2023, 4:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.