ETV Bharat / bharat

భాజపాలో జేడీఎస్​ విలీనం అవుతుందా? - BJP, JD(S) dismiss reports about merger

భాజపాలో జనతా దళ్​(సెక్యులర్​) విలీనం కాబోతోందంటూ వచ్చిన వార్తలతో కర్ణాటక రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. స్పందించిన ఇరు పార్టీలు.. ఇవన్నీ ఊహాగానాలేనని కొట్టిపారేశాయి.

BJP, JD(S) dismiss reports about merger
భాజపా-జేడీఎస్​ ల మధ్య పొత్తు లేనట్టేనా??
author img

By

Published : Dec 21, 2020, 1:27 PM IST

జనతా దళ్ సెక్యులర్​(జేడీఎస్​)ను భాజపాలో విలీనం చేసే అవకాశాలు ఉన్నాయనే వార్తలను ఆ రెండు పార్టీల నేతలు ఖండించారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భాజపా-జేడీఎస్ మధ్య​ పొత్తు లేదా విలీనం అనివార్యమనే వార్తలను సీఎం యడియూరప్ప, కూమారస్వామి కొట్టిపారేశారు.

అరవింద్ వ్యాఖ్యలతో రాజుకున్న అగ్ని..

ప్రస్తుతం దేశమంతా ప్రధాని నరేంద్ర మోదీ గాలి వీస్తోందని.. రాష్ట్రంలోనూ రాజకీయ సమీకరణాలు వేగంగా మారే అవకాశాలు ఉన్నాయని కర్ణాటక భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు అరవింద్​ లింబావలి వ్యాఖ్యానించారు. దీంతో జేడీఎస్​ను భాజపాలో విలీనం చేసే అవకాశాలు ఉన్నాయనే వార్తలు గుప్పుమన్నాయి. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల కేంద్రంగా భాజపా-జేడీఎస్ మధ్య​ పొత్తు, విలీనం వార్తలు చక్కర్లు కొట్టాయి.

సంక్రాతి తరవాత...?

ఈ వ్యవహారంపై కర్ణాటక మీడియాలో అనేక ఊహాగానాలు ప్రచారమయ్యాయి. సంక్రాతి తరువాత భాజపా-జేడీఎస్​ భాగస్వామ్యం ఏర్పడొచ్చని.. ఉగాది నుంచి కుమారస్వామి నేతృత్వంలో పొత్తు కొనసాగుతుందనే వార్తలతో.. కర్ణాటక రాజకీయాల్లో పెను దుమారం చెలరేగింది.

గతవారం కర్ణాటక శాసన మండలిలో జరిగిన ఘటన, కాంగ్రెస్​ ఎమ్మెల్సీలు మండలి ఛైర్మన్​ను ఆయన స్థానం నుంచి బలవంతంగా కిందకు లాక్కెళ్లడంపై మాత్రమే జనతాదళ్​ మాకు మద్దతుగా నిలిచింది. జేడీఎస్​ ఎమ్మెల్యే ఒకరు భాజపాలో చేరుతున్నారా? లేక మొత్తం పార్టీనే విలీనమవుతుందా? అనేది ఇప్పటికీ సందిగ్ధమే. ప్రస్తుతానికి మీడియాలో వచ్చేవన్నీ అవాస్తవాలే.

-యడియూరప్ప, కర్ణాటక సీఎం

మరోవైపు ఈ అంశంపై మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్​ నేత కుమారస్వామి తీవ్రంగా స్పందించారు.

జనతాదళ్ పార్టీ కార్యకర్తలకు ఒక విషయాన్ని సూటిగా చెప్పాలనుకుంటున్నా... భారతీయ జనతా పార్టీలో విలీనం చేయడమంటే మనం ఆత్మహత్య చేసుకున్నట్టే. భవిష్యత్తులోనూ పార్టీ అలాంటి నిర్ణయం తీసుకోదని స్పష్టం చేస్తున్నా.

-కుమారస్వామి, జేడీఎస్​ నేత

ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కొన్ని అంశాల్లో భాజపాకు మద్దతిస్తామని.. అంతమాత్రాన ఆ పార్టీలో విలీనం చేయబోమని కుమారస్వామి తెలిపారు.

గతంలో భాజపాతో దోస్తీ..

పరస్పరం అధికారాన్ని పంచుకునే ఒప్పందంపై 2006లో భాజపాతో కలసి జేడీఎస్ ఏర్పాటు చేసిన ​​సంకీర్ణ ప్రభుత్వం 20 నెలలకే కుప్పకూలింది. అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2018లోనూ భాజపా మద్దతుతో అధికారం చేపట్టి కొద్దిరోజులకే కుప్పకూలింది.

ఇదీ చదవండి: కర్ణాటక శాసనమండలిలో బాహాబాహీ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.