ETV Bharat / bharat

దీదీకి భాజపా సవాల్.. టీఎంసీ కౌంటర్ - బంగాల్

సవాళ్లు, ప్రతిసవాళ్లతో బంగాల్​ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. నందిగ్రామ్​ మినహా మరో స్థానం నుంచి పోటీ చేయనని మమతా బెనర్జీ ప్రకటించగలరా అని భాజపా ఛాలెంజ్​ చేసింది. అయితే అంతే ధీటుగా బదులిచ్చింది తృణమూల్ కాంగ్రెస్.

BJP challenges Mamata to announce she will contest only from  Nandigram, TMC hits back
దీదీకి భాజపా సవాల్.. టీఎంసీ గట్టి కౌంటర్
author img

By

Published : Feb 21, 2021, 5:38 AM IST

బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సవాలు విసిరింది భారతీయ జనతా పార్టీ (భాజపా). అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం నందిగ్రామ్​ నుంచే పోటీ చేస్తానని దీదీ ప్రకటించగలరా అని భాజపా జాతీయ కార్యదర్శి కైలాస్ విజయ వర్గీయ శనివారం ఛాలెంజ్ చేశారు.

"నందిగ్రామ్​ నుంచి పోటీ చేస్తానని మమత బెనర్జీ చెప్పారు. గెలుపుపై విశ్వాసం ఉంటే మరో చోటు నుంచి బరిలో నిలవనని ఆమె ప్రకటించాలి. లేదంటే నందిగ్రామ్​పై దీదీకి నమ్మకం లేనట్లే." అని వర్గీయ ట్వీట్ చేశారు.

టీఎంసీ కౌంటర్​..

భాజపా సవాలును తిప్పికొట్టింది అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ). "నందిగ్రామ్​లో అభ్యర్థిని ప్రకటించడానికి భాజపా ఎందుకు భయపడుతోంది? ఇప్పటివరకూ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎందుకు ప్రకటించలేదు?" అని టీఎంసీ ప్రశ్నించింది.

కీలకమైన నందిగ్రామ్​ నుంచి పోటీ చేస్తానని జనవరిలో మమత ప్రకటించారు. అయితే నందిగ్రామ్​ అభ్యర్థిని ప్రకటించని భాజపా.. ముఖ్యమంత్రి ఎవరనేది అధికారంలోకి వచ్చాక నిర్ణయిస్తామని చెప్పింది.

ఇదీ చూడండి: 50 వేల ఓట్ల తేడాతో దీదీని ఓడిస్తా: సువేందు

ఇదీ చూడండి: డ్రగ్స్‌ కేసు చుట్టూ బంగాల్‌ రాజకీయాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.