BJP Central Election Committee Meeting : ఈ ఏడాది చివరిలో జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సన్నద్ధతపై బీజేపీ కసరత్తు చేపట్టింది. దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమైంది. ముఖ్యంగా ఈ సమావేశంలో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలపైనే చర్చించినట్లు తెలుస్తోంది. ఈ భేటీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు JP నడ్డా సహా పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యులు హాజరయ్యారు. ఛత్తీస్‌గఢ్‌లోని 27 అసెంబ్లీ సీట్లపై ప్రధానంగా చర్చించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. వీటిని ఏ, బీ, సీ, డీ వర్గాలుగా విభజించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తాజాగా జరిపిన సమావేశంలో బీ, సీ కేటగిరీలో ఉన్న 22 స్థానాలు, డీ కేటగిరీలో ఉన్న 5 సీట్లపైనే చర్చించినట్లు చెప్పాయి. మెజారిటీ స్థానాల్లో కొత్త అభ్యర్థులను నిలబెట్టే అంశాన్ని పరిశీలించినట్లు సమాచారం.
-
#WATCH | Meeting of the central election committee of Bharatiya Janata Party underway at the party headquarters in Delhi
— ANI (@ANI) August 16, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
PM Modi, BJP president JP Nadda, Union ministers Amit Shah and Rajnath Singh and other leaders of the party present pic.twitter.com/OLNZMwpHyP
">#WATCH | Meeting of the central election committee of Bharatiya Janata Party underway at the party headquarters in Delhi
— ANI (@ANI) August 16, 2023
PM Modi, BJP president JP Nadda, Union ministers Amit Shah and Rajnath Singh and other leaders of the party present pic.twitter.com/OLNZMwpHyP#WATCH | Meeting of the central election committee of Bharatiya Janata Party underway at the party headquarters in Delhi
— ANI (@ANI) August 16, 2023
PM Modi, BJP president JP Nadda, Union ministers Amit Shah and Rajnath Singh and other leaders of the party present pic.twitter.com/OLNZMwpHyP
పార్టీ బలహీనంగా ఉన్న స్థానాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా గత ఎన్నికల్లో ఓడిపోయిన సీట్లపై సుదీర్ఘంగా చర్చించినట్లు పేర్కొన్నాయి. వీటితో పాటు ఆయా రాష్ట్రాల నాయకత్వం ఇచ్చిన నివేదికను పరిశీలించినట్లు తెలిపాయి. ఈ సమావేశానికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో పాటు ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం రమణ్ సింగ్ పాల్గొన్నారు. పార్టీ అభ్యర్థులు, ఎన్నికల వ్యూహాల ఖరారే లక్ష్యంగా.. ఈ సమావేశం జరిగింది.
వాస్తవానికి ఎన్నికల తేదీల ప్రకటనకు కొద్దిరోజుల ముందు ఈ కమిటీ భేటీ అవుతుంది. అయితే కొద్దినెలల ముందే ఈ కమిటీ సమావేశం కానుండడంపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కర్ణాటకలో ఓటమి దృష్ట్యా.. త్వరలో జరిగే ఎన్నికల్లో రాజీలేని పోరాటం చేయాలని బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది చివరిలో మిజోరం, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, తెలంగాణలో విపక్ష పార్టీలు అధికారంలో ఉన్నాయి. ఈ మూడుచోట్ల అధికారం కోసం బీజేపీ ప్రయత్నిస్తోంది.
Mizoram Election 2023 Prediction : మరోవైపు మిజోరంలో అధికారంలో ఉన్నప్పటికీ.. మిత్రపక్షం MNF ఇటీవల లోక్‌సభలో జరిగిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసింది. మణిపుర్ సమస్యను పరిష్కరించడంలో బీజేపీ విఫలమైందనే ఆరోపణలు చేస్తూ MNF బీజేపీకి దూరంగా జరిగింది. అధికారంలో ఉన్న మరో రాష్ట్రం మధ్యప్రదేశ్‌లోనూ కాంగ్రెస్ నుంచి గట్టిపోటీ ఎదురవుతుందని బీజేపీ అంచనా వస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావించే ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో సత్తాచాటాలని భావిస్తున్న బీజేపీ.. ఈ మేరకు వ్యూహరచన చేసింది.
2024 General Election Bjp : ఈ సారి సార్వత్రిక ఎన్నికల్లోనూ ప్రతిపక్ష ఇండియాతో గట్టి పోటీ ఉంటుందని బీజేపీ అంచనా వేస్తోంది. తాజాగా జరిగిన భేటీలో ఐదు రాష్ట్రాల్లో పార్టీ బలహీనంగా ఉన్న స్థానాలకు అభ్యర్థులను ఖరారుచేసే అంశంపై.. ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అభ్యర్థులను ముందే ప్రకటిస్తే.. వారు ఎన్నికలకు సన్నద్ధం కావడానికి సరిపడినంత సమయం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల హామీలు సహా విపక్షాలను దీటుగా ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధానంగా చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
Telangana BJP 2023 Elections Plan : 'పార్టీ బలహీనంగా ఉన్న చోట త్వరితగతిన బలోపేతం చేయాలి'
2024 ఎన్నికలే బీజేపీ టార్గెట్.. పాత స్నేహితుల కోసం ఆరాటం.. మీటింగ్‌కు రావాలని లేఖలు!