బంగాల్ ఎన్నికల్లో బరిలో దిగబోయే 157 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది భారతీయ జనతా పార్టీ(భాజపా). ఈ మేరకు ఓ జాబితాను విడుదల చేసింది. పార్టీ ఉపాధ్యక్షుడు, మాజీ టీఎంసీ నేత ముకుల్‌రాయ్ ఉత్తర కృష్ణానగర్ నుంచి పోటీ చేస్తున్నట్టు ప్రకటించిన భాజపా.. రాష్ట్ర మాజీ అధ్యక్షుడు రాహుల్ సిన్హాకు హబ్రా అసెంబ్లీ సీటు కేటాయించింది.
వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు, సిట్టింగ్ ఎంపీలకు ప్రాధాన్యమిచ్చే వ్యూహంతో ముందడుగేసింది భాజపా. హరింఘటా స్థానం నుంచి జానపద కళాకారుడు అశీమ్ సర్కార్, పుర్బస్థలి ఉత్తర్లో శాస్త్రవేత్త గోవర్ధన్ దాస్‌లను పోటీలో నిలుపుతున్నట్టు పేర్కొంది. ఐదుగురు సిట్టింగ్ ఎంపీలను కూడా జాబితాలో చేర్చింది. అంతే కాకుండా కొత్తగా పార్టీలో చేరిన 22 మందిని తమ అభ్యర్థుల జాబితాలో చేర్చింది. మహిళలు సహా 17 మంది ముస్లిం అభర్యులకు అవకాశం కల్పించింది.
భాజపాలో చేరిన 'రామాయణ' సీరియల్ నటుడు
ఈ జాబితా ప్రకటించడానికి ముందు.. ప్రముఖ రామాయణ సీరియల్లో రాముని పాత్ర పోషించిన నటుడు అరుణ్ గోవిల్ భాజపాలో చేరారు. పార్టీ సీనియర్ నాయకుల సమక్షంలో ఆయన కండువా కప్పుకున్నారు.
రాష్ట్రంలో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు గానూ.. ఎనిమిది దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 27న తొలి దశ పోలింగ్ ప్రారంభం కానుంది. మే 2న ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది.
ఇవీ చదవండి: