ETV Bharat / bharat

BJP and Janasena Alliance in Telangana : కేంద్రమంత్రి అమిత్​ షాతో పవన్​ కల్యాణ్​ భేటీ.. పొత్తుపై క్లారిటీ వచ్చినట్లేనా?

BJP and Janasena Alliance in Telangana: కేంద్రమంత్రి అమిత్​ షాతో జనసేన అధినేత పవన్​ కల్యాణ్​ భేటీ అయ్యారు. తెలంగాణలో సీట్ల సర్దుబాటు, పొత్తుపై ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశం దాదాపు 45 నిమిషాల పాటు సాగింది. ఇంకా పొత్తు విషయంపై సమాచారం తెలియాల్సి ఉంది.

BJP and Janasena Alliance
BJP and Janasena Alliance in Telangana
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 25, 2023, 7:52 PM IST

Updated : Oct 25, 2023, 10:23 PM IST

BJP and Janasena Alliance in Telangana: తెలంగాణ ఎన్నికల(Telangana Assembly Election 2023) నేపథ్యంలో గెలుపే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. అందులో భాగంగా తమతో కలిసి వచ్చే పార్టీలతో ముందుకు వెళ్లడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో జనసేనతో కలిసి ముందుకు వెళ్లడానికి భారతీయ జనతాపార్టీ సిద్ధపడింది. ఈ విషయంపై కేంద్ర మంత్రి అమిత్​ షా(Central Minister Amith Shah)తో చర్చించేందుకు దిల్లీ వెళ్లిన జనసేన అధినేత పవన్​ కల్యాణ్​.. దాదాపు 45 నిమిషాల పాటు సీట్ల సర్దుబాటు, పొత్తు(BJP And Janasena Alliance in Telangana)పై సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పవన్​తో పాటు జనసేన సీనియర్​ నేత నాదెండ్ల మనోహర్​.. బీజేపీ నుంచి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్​ రెడ్డి ఉన్నారు.

Kishan Reddy Comments on BJP and Janasena Alliance: అంతకు ముందు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్​రెడ్డి మాట్లాడుతూ.. జాతీయ నాయకత్వంతో మాట్లాడాకే జనసేనతో పొత్తుపై స్పష్టత వస్తుందని తెలిపారు. జనసేన ఎన్డీఏలో భాగస్వామ్యం.. అందుకనే తెలంగాణలో పొత్తు పెట్టుకుంటున్నట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్​లో పొత్తుపై అక్కడి నాయకత్వం చూసుకుంటుందని అన్నారు. నవంబరు 1న బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ ఉంటుంది. అప్పుడే తెలంగాణలో పెండింగ్​ స్థానాలపై చర్చిస్తామని కిషన్​ రెడ్డి స్పష్టం చేశారు.

Telangana BJP MLA Candidates First List 2023 : 55 మంది అభ్యర్థులతో నేడే బీజేపీ తొలి జాబితా.. గజ్వేల్​లో కేసీఆర్​పై​ ఈటల పోటీ!

BJP Janasena Alliance in Telangana: ఇప్పటికే జనసేన పార్టీ తెలంగాణలో 32 నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో బీజేపీతో పొత్తు అంశం మాట్లాడేందుకు పవన్​ కల్యాణ్​ దిల్లీ వెళ్లారు. మరి పొత్తు ఉంటుందా.. ఉండదా.. ఉంటే ఎన్ని సీట్లలో జనసేన, బీజేపీ పోటీ చేస్తాయో తెలియాల్సి ఉంది. ముందు నుంచి జనసేన అధినేత ఎప్పుడైతే తెలంగాణలో పోటీ చేస్తామని ప్రకటించారో.. అప్పటి నుంచి బీజేపీ అధినాయకత్వం జనసేనతో కలిసి పోటీ చేస్తే బాగుంటుందనే అభిప్రాయంతో ఉంది.

Telangana BJP MLA Candidates Second List 2023: ఇప్పటికే బీజేపీ మొదటి జాబితాలో 52 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినప్పటికీ.. మరో 67 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేందుకు ముమ్మరంగా కసరత్తును చేస్తోంది. ఈ రెండో జాబితా కూడా నవంబరు 1 లేదా రెండో తేదీలో వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే మొదటి జాబితాలో కరీంనగర్​, వరంగల్​, ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాల్లో అత్యధిక స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇంకా హైదరాబాద్​, నిజామాబాద్​, మెదక్​, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం, మహబూబ్​నగర్​ జిల్లాల్లో స్థానాలకు ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈసారి రెండో జాబితాలో పార్టీలో ప్రముఖ నేతలను ఎన్నికల బరిలోకి దించే అవకాశం ఉంది. ఇప్పటికే మునుగోడు నియోజకవర్గ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి పార్టీకి రాజీనామా చేసి.. కాంగ్రెస్​లోకి చేరడానికి సిద్ధమయ్యారు. ఇప్పుడు ఆ స్థానంపై బీజేపీ ఎవరిని ఉంచి పోటీ చేస్తుందో చూడాలి. అలాగే జనసేన, బీజేపీ పొత్తు ఉంటే ఏ స్థానాల్లో పోటీ చేస్తారో ఇంకా కొన్ని రోజులు వేచి ఉండాల్సిందే.

BJP Leaders Meeting on Telangana Elections : దిల్లీలో బీజేపీ నేతల సమావేశం.. తెలంగాణ ఎన్నికలపై చర్చ

Kishan Reddy on BJP Second List : దసరా తర్వాత రెండో జాబితా.. మేడిగడ్డ ఘటనపై కేంద్రానికి లేఖ రాస్తామన్న కిషన్ రెడ్డి

Last Updated : Oct 25, 2023, 10:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.