ETV Bharat / bharat

పెట్రోల్, గ్యాస్​​ ధరలు తగ్గించాలని భాజపాకు మిత్రపక్షం డిమాండ్​ - జేడీయూ వార్తలు

తాజాగా పెరిగిన పెట్రోల్​, వంటగ్యాస్​ ధరలను(LPG Cylinder Price) తగ్గించాలని భాజపా మిత్రపక్షం జేడీయూ.. నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని డిమాండ్​ చేసింది. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని సూచించింది.

jdu
జేడీయూ
author img

By

Published : Sep 2, 2021, 8:38 AM IST

పెరిగిపోతున్న ఇంధన ధరలను తగ్గించాలని భాజపా మిత్రిపక్షమైన జేడీయూ.. నరేంద్ర మోదీ సర్కారుకు సూచించింది. తాజాగా వంటగ్యాస్ సిలిండర్ ధరల పెంపును (LPG Cylinder Price) ఉపసంహరించుకోవాలని డిమాండ్​ చేసింది. ఇటువంటి నిర్ణయాలు సాధారణ ప్రజలపై ఎక్కువగా ప్రభావం చూపుతున్నాయని జేడీయూ అధికార ప్రతినిధి కేసీ త్యాగీ పేర్కొన్నారు.

ఎల్​పీజీ ధరలు పదేపదే పెంచడం వల్ల ప్రజల బడ్జెట్‌పై ప్రతికూల ప్రభావం చూపుతోందని అన్నారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కోరారు. అంతేగాకుండా పెట్రోల్​, డీజిల్​ ధరల పెరుగుదలను(Petrol price today) మార్కెట్​కు అనుగుణంగా వదిలేయడాన్ని తప్పుపట్టారు. ప్రజాప్రయోజనార్థం ఈ ఖర్చులను అరికట్టేందుకు మోదీ సర్కారు తప్పక ముందుకు రావాలని అన్నారు.

ఇదీ చూడండి: ఇంధన ధరలపై మోదీ సర్కారుకు రాహుల్ చురకలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.