ETV Bharat / bharat

భాజపాకు మమత 'గ్యాస్​ బెలూన్​' పంచ్​ - 2021 bengal elections etv bharat

భాజపాను.. వార్తల్లో నిలిచే ఓ గ్యాస్​ బెలూన్​గా అభివర్ణించారు బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. తమ వద్ద ఉన్న నల్లధనాన్ని మార్చుకునేందుకే తృణమూల్​ నేతలు పార్టీని వీడి భాజపాలో చేరుతున్నారని ఆరోపించారు. భాజపా.. నల్లధనాన్ని మార్చే వాషింగ్ ​మెషిన్​ అని ఎద్దేవా చేశారు.

BJP a gas balloon alive only in the media : Mamata
భాజపాకు మమత 'గ్యాస్​ బెలూన్​' పంచ్​
author img

By

Published : Feb 1, 2021, 6:54 PM IST

భాజపాపై మరోమారు విరుచుకుపడ్డారు బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. భాజపాను.. కేవలం మీడియా కోసమే పనిచేసే ఓ గ్యాస్​ బెలూన్​ అని అభివర్ణించారు. దురుద్దేశాలు ఉన్న వారికి డబ్బులు అందించే ఓ వాషింగ్​ మెషిన్​ అని పేర్కొన్నారు.

కోల్​కతా నేతాజీ ఇండోర్​ స్టేడియంలో.. ఆల్​ ఇండియా ఫెయిర్​ ప్రైజ్​ షాప్​ డీలర్స్​ ఫెడరేషన్​ నిర్వహించిన రాష్ట్రస్థాయి సమావేశంలో పాల్గొన్నారు మమత. ఇంతకాలం పోగు చేసుకున్న సొమ్ములను భద్రపరుచుకునేందుకే నేతలు తృణమూల్​ను వీడి భాజపాలో చేరుతున్నారని ఆరోపించారు. ఒకవేళ వారు పార్టీలో ఉన్నా.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వారికి టికెట్​ ఇవ్వకూడదని తాను నిర్ణయించుకున్నట్టు పేర్కొన్నారు.

"ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో మళ్లీ అధికారం చేపడతాం. భాజపా ఓ గ్యాస్​ బెలూన్​.. కేవలం మీడియా కోసమే పనిచేస్తుంది. వారి దగ్గర డబ్బులున్నాయి. వీధుల్లో జెండాలను ఎగరేసేందుకు ఏజెన్సీలను ఉపయోగించుకుంటున్నారు. వారిని అలాగే ఉండి వార్తల్లో నిలవనివ్వండి. ప్రజల గుండెల్లో టీఎంసీ ఉంటుంది. మీరు(ప్రజలు) నాకు ఈ మాట ఇవ్వండి.. నేను మీకు మంచి భవిష్యత్తును ఇస్తాను. దోపిడీదారులు ఇంతకాలం డబ్బులను దోచుకున్నారు. ఇప్పడు భాజపా అనే వాషింగ్​ మెషిన్​ దగ్గరకు వెళ్లి.. నల్ల ధనాన్ని న్యాయపరమైన సొమ్ములుగా మర్చుకుంటున్నారు. అంతే! దానికి మించి అక్కడ ఏమీ లేదు."

-- మమతా బెనర్జీ, బంగాల్​ ముఖ్యమంత్రి.

మరో ఎమ్మెల్యే..

మరోవైపు టీఎంసీ నేతల్లో అసహనం రోజురోజుకు పెరిగిపోతోంది. తాజాగా.. డైమండ్​ హార్బర్​ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన దీపక్​ హల్దర్​.. పార్టీకి వ్యతిరేకంగా తీవ్ర ఆరోపణలు చేశారు. టీఎంసీ.. తనను ప్రజల కోసం పనిచేయనివ్వకుండా అడ్డుకుంటోందని.. పార్టీ నాయకత్వంపై మండిపడ్డారు. త్వరలో పార్టీని వీడుతానని తేల్చిచెప్పారు.

దీపక్​​.. భాజపా నేత సోవన్​ ఛటర్జీకి సన్నిహితుడు. ఇటీవలే.. దక్షిణ కోల్​కతాలోని ఆయన నివాసానికి వెళ్లారు హల్దర్​. ఈ తరుణంలో దీపక్​.. భాజపాలో చేరే అవకాశాలు ఉన్నట్టు ఊహాగానాలు జోరందుకున్నాయి.

ఇదీ చూడండి:- 'కార్పొరేట్లకు ప్రభుత్వ ఆస్తులు ధారాదత్తం!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.