ETV Bharat / bharat

'బిట్​కాయిన్​ పేరుతో మోసం.. రూ. 45 లక్షలు పోగొట్టుకున్నా'

బిట్​కాయిన్​ విలువ రోజురోజుకూ పెరిగిపోతూనే ఉంది. దీన్ని అవకాశంగా చేసుకుని సైబర్ ​నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా కర్ణాటక హుబ్లీకి చెందిన ఓ వ్యాపారి రూ. 45 లక్షలు పోగొట్టుకున్నాడు.

BitCoin fraud: Hubbali businessman lost 45 lakhs
'బిట్​కాయిన్​ పేరుతో మోసం.. రూ. 45 లక్షలు పోగొట్టుకున్నా'
author img

By

Published : Feb 17, 2021, 7:43 PM IST

Updated : Feb 17, 2021, 7:52 PM IST

బిట్​కాయిన్​ పేరుతో జరిగిన మోసంలో కర్ణాటకలోని హుబ్లీకి చెందిన వాసప్ప లోకప్ప అనే వ్యాపారి రూ. 45 లక్షలు పోగొట్టుకున్నాడు. ఈ ఘరానా మోసంలో ఐదుగులు సైబర్​ నేరగాళ్లు ఉన్నట్లు బాధితుడు తెలిపాడు. వారిలో దిల్లీకి చెందిన అమిత్ భరద్వాజ్​, అజయ్​ భరద్వాజ్​లు ప్రస్తుతం స్థానికంగా బిట్​కాయిన్​ వ్యాపారం చేస్తున్నారని పేర్కొన్నాడు.

వీరంతా నగరంలో ఉండే ప్రముఖ వ్యాపారులను లక్ష్యంగా చేసుకొని.. చేతన్​ పాటిల్​ అనే స్థానికునితో మొదటగా మాట్లాడిస్తారని తెలిపాడు. ఇందుకు మంచి హంగులు ఉండే హోటళ్లను ఎంచుకుంటారని పేర్కొన్నాడు. ఆ సమావేశంలో బిట్​ కాయిన్​లో పెట్టుబడులు పెడితే లక్షలు ఆర్జించవచ్చని నమ్మిస్తారని చెప్పాడు. అలా వారిని నమ్మి తాను కూడా రూ. 45 లక్షలు పోగొట్టుకున్నట్లు గోడు వెళ్లబోసుకున్నాడు.

BitCoin fraud: Hubbali businessman lost 45 lakhs
మోసపోయిన వాసప్ప లోకప్ప

నిందితులపై కామారిపేట పోలీస్​స్టేషన్​లో కేసు నమోదు చేశాడు బాధితుడు.

''అమిత్​ అనే వ్యక్తి దేశవ్యాప్తంగా ఇప్పటికే చాలా మందిని మోసగించాడు. అతని వలలో పడి మోసపోయిన వారి జాబితాలో మరో 50 మంది వరకు ఉండొచ్చు.''

- వాసప్ప లోకప్ప, బాధితుడు

ఇదీ చూడండి: పుల్వామా​లో ముగ్గురు ఉగ్ర అనుచరుల అరెస్ట్

Last Updated : Feb 17, 2021, 7:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.