కుటుంబ సభ్యుల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం మానవ జీవనంలో సహజం. అయితే.. కర్ణాటకలో ఓ శునకం అదే తరహాలో తన అభిమానుల మధ్య జన్మదినాన్ని జరుపుకుంది. అదీ అచ్చం మనలాగే కేక్ కట్ చేసి. ఇదే ఆశ్చర్యం అనుకుంటే... ఏకంగా దానికి 250 గ్రాముల బంగారు గొలుసు గిఫ్ట్‌గా ఇచ్చారు ఆ యజమానులు. అంతే కాదండోయ్.. ఊరు ఊరంతా చెప్పుకునేలా.. సుమారు 200 మందికిపైగా అల్పాహారం కూడా పెట్టించారు.
విజయపుర జిల్లాలోని నిడగుండికి చెందిన సంగయ్య.. మూడేళ్ల క్రితం గడగ్ జిల్లా నుంచి ఓ పెంపుడు కుక్కను తెచ్చకున్నారు. దానికి 'టైగర్' అని పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. సంగయ్యకు ముగ్గురు పిల్లలు కాగా.. నాల్గో కుమారుడిగా ఆ కుటుంబంలో ఒకటైంది టైగర్.
గతంలోనూ..
ఇలా.. ఏటా టైగర్‌కు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తోంది సంగయ్య కుటుంబం. అంతకుముందు కూడా ఇదే తరహాలో సుమారు 500 మందిని ఆహ్వానించారట. అప్పుడు 50 గ్రాముల బంగారం గొలుసునూ ఇచ్చానంటున్నారా కుటుంబ సభ్యులు. ఇటీవల దాని పుట్టినరోజు సందర్భంగా.. మరోమారు 250 గ్రాముల పసిడి బహూకరించారు.
ఇదీ చూడండి: కదిలే రైల్లోనే అదిరే 'ఖాదీ' ఫ్యాషన్ షో