ETV Bharat / bharat

Cds Bipin Rawat: గంగమ్మ ఒడికి రావత్​ దంపతుల అస్థికలు - హెలికాప్టర్​ ప్రమాదం

Bipin Rawat funeral: భారత త్రిదళాధిపతి బిపిన్​ రావత్​ దంపతుల అస్థికలను ఉత్తరాఖండ్ హరిద్వార్​లోని గంగానదిలో కలిపారు వారి కుమార్తెలు. దిల్లీలోని బ్రార్​ స్క్వేర్​ నుంచి చితాభస్మాల్ని సేకరించి.. నేరుగా హరిద్వార్​ చేరుకుని నదిలో కలిపారు.

bipin-rawat-funeral
రావత్​ చితాభస్మం
author img

By

Published : Dec 11, 2021, 1:27 PM IST

గంగమ్మ ఒడికి రావత్​ దంపతుల అస్థికలు

Bipin Rawat funeral: భారత తొలి త్రిదళాధిపతి జనరల్​ బిపిన్​ రావత్​, ఆయన సతీమణి మధులికా రావత్​ల చితాభస్మం గంగమ్మ ఒడికి చేరింది. సంప్రదాయ పద్ధతుల్లో అన్ని కార్యక్రమాలు నిర్వహించి అస్థికలను ఉత్తరాఖండ్​ హరిద్వార్​లోని గంగానదిలో కలిపారు వారి కుమార్తెలు.

bipin-rawat-funeral
రావత్​ దంపతుల అస్థికలను తీసుకెళ్తున్న కుటుంబ సభ్యులు

దిల్లీ కంటోన్మెంట్​లోని బ్రార్​ స్క్వేర్​ శ్మశానవాటిక నుంచి రావత్​ దంపతుల చితాభస్మాల్ని శనివారం ఉదయం సేకరించారు ఆయన కుమార్తెలు క్రితిక, తరిణి. అక్కడి నుంచి నేరుగా ఉత్తరాఖండ్​లోని హరిద్వార్​కు చేరుకున్నారు. నదీ తీరంలో వారి ఆత్మకు శాంతి చేకూరాలని, హిందూ సంప్రదాయం ప్రకారం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి అస్థికలను నదిలో కలిపారు.

bipin-rawat-funeral
హరిద్వార్​లో చివరి కార్యక్రమాలు చేపట్టిన రావత్​ కుమార్తెలు
bipin-rawat-funeral
గంగానదిలో రావత్​ దంపతుల చితాభస్మాన్ని కులుపుతున్న కుమార్తెలు

ఈనెల 8న తమిళనాడులోని కూనూర్​లో జరిగిన హెలికాప్టర్​ ప్రమాదంలో సీడీఎస్​ బిపిన్​ రావత్​ దంపతులు మరణించగా.. శుక్రవారం దిల్లీలోని బ్రార్​ స్క్వేర్​​లో అధికారిక లాంఛనాలతో వారి అంత్యక్రియలు జరిగాయి. త్రివిధదళాలు 17 గన్​ సెల్యూట్​ చేశాయి. వీరుడికి యావత్​ దేశం కన్నీటి వీడ్కోలు పలికింది.

ఇదీ చూడండి:

Last Rites of CDS: యుద్ధవీరుడు రావత్​కు కన్నీటి వీడ్కోలు

నేలరాలిన త్రిదళపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.