Bipin Rawat funeral: భారత తొలి త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్ అంత్యక్రియల్లో 17 గన్ సెల్యూట్‌ను సమర్పించారు. తుపాకులతో సైనిక వందనం సంప్రదాయం ఎప్పుడు ప్రారంభమైంది? రావత్‌కు 17 గన్ సెల్యూట్ వందనం దేనికోసం?
భారత్‌లో స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం సందర్భంగా 21 తుపాకులతో త్రివర్ణ పతాకానికి వందనం సమర్పిస్తుంటారు. ఇది ఒక రకమైన సైనిక వందనం. 16వ శతాబ్ధంలో బ్రిటన్ నావికాదళం దీనిని ప్రారంభించింది. ఇందుకు శతఘ్నులు లేదా తుపాకులను వాడవచ్చు. ఈ తుపాకుల వందనాన్ని వివిధ వ్యక్తులకు, వివిధ సందర్భాల్లో వారి గౌరవార్థం ఉపయోగిస్తారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ఈ ఆచారాన్ని పాటిస్తున్నాయి. ముఖ్యంగా బ్రిటీష్ పాలన నుంచి విముక్తి పొందిన కామన్‌వెల్త్ దేశాల్లో ఇది కనిపిస్తుంది. సాధారణంగా దేశాధ్యక్షుడు, విదేశీ అతిథులు పర్యటనకు వచ్చినప్పుడు 21 తుపాకుల వందనాన్ని సమర్పిస్తారు. వీటిల్లో సందర్భానికి అనుగుణంగా 19 తుపాకుల వందనం, 17 తుపాకుల వందనాలు కూడా ఉంటాయి. రాష్ట్రపతి, అత్యంత సీనియర్ సైనికాధికారులకు 21 తుపాకుల వందనం ఇస్తారు. త్రివిధ దళాధిపతులకు 17 గన్ సెల్యూట్ సమర్పిస్తారు.
ప్రస్తుత సీడీఎస్ బిపిన్ రావత్ ఫోర్‌స్టార్ జనరల్. ఆయన ఆర్మీ చీఫ్, నేవీ చీఫ్, ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌తో సమానమైన ర్యాంక్. కానీ, వీరందరిలో ప్రథముడిగా వ్యవహరిస్తున్నారు. అందుకే 17గన్ సెల్యూట్ ఆయనకు సమర్పించారు. దీనికి 2233 ఫీల్డ్ రెజిమెంట్ నుంచి ఇవి వచ్చాయి. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ నుంచి లెఫ్టినెంట్ జనరల్ హోదాకు సమానమైన ఆరుగురు అధికారులు ఫ్లాగ్ బేరర్లుగా వ్యవహరిస్తున్నారు. దేశంలోని త్రివిధ దళాల్లోని అత్యంత సీనియర్లైన 800 మంది అధికారులు ఈ అంత్యక్రియలకు హాజరయ్యారు.
ఇదీ చూడండి: