ETV Bharat / bharat

నడిరోడ్డుపై యువతి హత్య.. ప్రతీకారంతో మాజీ ప్రేమికుడే... - Dwarka NEWS

దేశ రాజధానిలో ఘోరం జరిగింది. తన మాజీ ప్రేయసిని నడిరోడ్డుపై కత్తితో పొడిచి చంపాడు ఓ దుండగుడు. గంటల వ్యవధిలోనే నిందితులు పట్టుబడ్డారు.

bindapur-police-arrested-22-year-girl-murder-accuse-through-cctv-footage
నడిరోడ్డుపై యువతి హత్య
author img

By

Published : Oct 20, 2021, 3:16 PM IST

దిల్లీ ద్వారకాలో ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. తన మాజీ ప్రేయసిపై ప్రతీకారంతో రగిలిపోయి.. నడిరోడ్డుపైనే కత్తితో పొడిచి చంపాడు. ఆ 22 ఏళ్ల యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. బిందాపుర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో సోమవారం అర్ధరాత్రి ఈ సంఘటన జరిగింది. ఆమెతో ఉన్న మరో వ్యక్తి కాపాడేందుకు ప్రయత్నించినా.. ప్రాణాలు దక్కలేదు.

కూతురు మరణవార్త విన్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. పుట్టినరోజు వేడుకలు చేసుకుంటానని రాత్రివేళ వెళ్లి.. తిరిగిరాలేదని బోరున విలపించారు. తమకు న్యాయం కావాలని డిమాండ్​ చేస్తున్నారు.

ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. యువతిని కొందరు యువకులు కత్తితో.. పలుమార్లు పొడవడం గుర్తించారు. గాలింపు చర్యలు చేపట్టి 14 గంటల్లో నిందితులను పట్టుకున్నారు. ప్రధాన నిందితుడు అంకిత్​ సహా మొత్తం ముగ్గురిని అరెస్టు చేశారు.

యువతిని కత్తితో పొడుస్తున్న నిందితుడు

ఇదీ చూడండి: లఖింపుర్ హింసపై విచారణ.. యూపీ సర్కారుపై సుప్రీం అసహనం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.