ETV Bharat / bharat

'విజయవంతమైన కూటమిగా బిమ్​స్టెక్' - bimstec members

బిమ్‌స్టెక్‌ విజయవంతమైన ప్రాంతీయ కూటమిగా సభ్యదేశాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా ఎదుగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ దిశగా అనుసంధాన మాస్టర్‌ ప్లాన్ల రూపకల్పన వంటి అనేక అంశాల్లో ఇప్పటికే పురోగతిని సాధించిందన్నారు.

PM Modi
ప్రధాని నరేంద్ర మోదీ
author img

By

Published : Jun 7, 2021, 4:44 AM IST

బిమ్​స్టెక్(బే ఆఫ్ బంగాల్ ఇనీషియేటివ్​ ఫర్​ మల్టీ సెక్టోరల్ టెక్నికల్​ అండ్​ ఎకనామిక్​ కోఆపరేషన్) విజయవంతమైన ప్రాంతీయ కూటమిగా ఎదుగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రాంతీయ కూటమిగా సభ్యదేశాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా ఉందన్నారు. బిమ్‌స్టెక్‌ విజయవంతమైన ప్రాంతీయ కూటమిగా సభ్యదేశాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా ఎదుగుతోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ దిశగా అనుసంధాన మాస్టర్‌ ప్లాన్ల రూపకల్పన వంటి అనేక అంశాల్లో ఇప్పటికే పురోగతిని సాధించిందన్నారు.

భారత్‌తోపాటు బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక, థాయ్ లాండ్, నేపాల్, భూటాన్లతో కూడిన ఈ కూటమి 24వ వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ సందేశమిచ్చారు. ఈ కూటమి మరింత ప్రగతిని సాధించి బంగాళాఖాతం ప్రాంతంలో భద్రత, శాంతి, సౌభాగ్యాలు విలసిల్లేలా సహకారం అందించడంలో ఉన్నత శిఖరాలకు చేరుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

మే 31వ తేదీతో ఉన్న ఈ సందేశాన్ని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి ఆరందమ్ బాగ్చీ ఆదివారం ట్వీట్ చేశారు.

ఇదీ చదవండి : 'కేంద్రం తాపత్రయమంతా ట్విట్టర్ బ్లూ టిక్స్​పైనే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.