ETV Bharat / bharat

మోదీ అంగీకారంతోనే ఆ కేసు దోషుల్ని విడుదల చేశారా, కాంగ్రెస్ సూటి ప్రశ్న - గ్యాంగ్ రేప్​పై గుజరాత్ తీర్పు

గుజరాత్ బిల్కిస్ బానో అత్యాచార కేసులోని దోషులను విడుదల చేయడంపై విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అటువంటి వారిని విడుదల చేయడంపై కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ స్పందించారు. నారీ శక్తి గురించి మాట్లాడిన మోదీ ఇలా చేయడం ఏంటని ప్రశ్నించారు.

rahul gandhi
Rahul gandhi
author img

By

Published : Aug 17, 2022, 7:39 PM IST

Bilkis bano Case on Gujarat : గుజరాత్‌లో చోటుచేసుకున్న బిల్కిస్‌ బానో పై అత్యాచార కేసులో దోషులను విడుదల చేయడంపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం చెలరేగుతోంది. ఈ విషయంపై తీవ్రంగా స్పందించిన కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ.. ప్రధాని మోదీ చెప్పిన మాటలు, చేస్తోన్న పనుల మధ్య తేడాను యావత్‌ దేశం గమనిస్తోందన్నారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ చేసిన ప్రసంగంలో ‘నారీ శక్తి’ గురించి మాట్లాడిన విషయాన్ని రాహుల్ ప్రస్తావించారు.

"ఐదు నెలల గర్భిణిగా ఉన్న మహిళపై సామూహిక అత్యాచారం చేయడమే కాకుండా ఆమె మూడేళ్ల చిన్నారిని చంపేశారు. అటువంటి వారిని ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ వేళ విడుదల చేశారు. మహిళాశక్తి గురించి మాట్లాడేవారు దేశ మహిళలకు ఇచ్చే సందేశం ఏమిటి..? మోదీజీ.. మీ మాటలు, చేతల మధ్య తేడాను దేశం మొత్తం గమనిస్తోంది"
-రాహుల్‌ గాంధీ ట్వీట్‌

Cong asks PM Modi: మహిళలను కించపరిచే పనులు చేయబోమని ప్రతిజ్ఞ చేయాలంటూ ఎర్రకోట ప్రసంగంలో పిలుపునిచ్చిన మోదీ.. చేసే పనులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయంటూ రాహుల్‌ గాంధీ మండిపడ్డారు.మహిళలకు గౌరవం విషయంలో ప్రధాని మాటలకు, చేతలకు పొంతన లేదని విమర్శించారు. ఈ కేసులో బాధితులకు మోదీ ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందన్నారు.

ఇదే విషయంపై స్పందించిన కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ.. గ్యాంగ్‌ రేప్‌ కేసులో దోషులను విడుదల చేయడం అన్యాయం, బాధితులను కించపరచడం కాదా? అని ప్రశ్నించారు. మహిళలపై గౌరవం కేవలం ప్రసంగాల్లోనేనా..? అని మహిళలు అడుగుతున్నారని అన్నారు. మరోవైపు ప్రధాని మోదీకి చిత్తశుద్ధి ఉంటే అత్యాచార కేసులో దోషుల విడుదల విషయంలో గుజరాత్‌ ప్రభుత్వ నిర్ణయంలో జోక్యం చేసుకోవాలని టీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ కూడా వ్యాఖ్యానించారు.

Remission policy: ఇదిలాఉంటే, బిల్కిస్‌ బానో సామూహిక అత్యాచార కేసులో 11 మంది దోషులను విడుదల చేయడాన్ని గుజరాత్‌ సర్కారు సమర్థించుకుంది. 1992 నాటి రెమిషన్‌ విధానం కింద ఖైదీలను విడుదల చేసినట్లు తెలిపింది. ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న దోషులందరూ విడుదల కావడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఇవీ చదవండి

ఫోన్​ ఏదైనా ఛార్జర్ ఒకటే, కేంద్రం కీలక నిర్ణయం

మహిళ అలాంటి దుస్తులు ధరిస్తే లైంగిక వేధింపుల సెక్షన్ వర్తించదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.