మానవత్వానికి ప్రతీకలుగా నిలిచారు ఓ తమిళనాడు పోలీసు, మరో కర్ణాటక బైకర్. బస్సులో ఉన్న ఓ మహిళ చేజార్చుకున్న మందులను ఛేజ్ చేసి మరీ ఆమెకు చేరవేర్చగలిగారు వీరిద్దరూ. ఈ వీడియో కాస్తా వైరల్ కాగా.. వారికి సామాజిక మాధ్యమాల్లో ప్రశంసలు లభిస్తున్నాయి.
-
Kudos to the good hearts who took pains for the old woman to get her pills which she had missed in the other bus.
— Sudha Ramen IFS 🇮🇳 (@SudhaRamenIFS) March 25, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Tn police personnel Krishna moorthy and biker @anny_arun shows that small act of kindness will make our lives beautiful. pic.twitter.com/QiSysVDTqv
">Kudos to the good hearts who took pains for the old woman to get her pills which she had missed in the other bus.
— Sudha Ramen IFS 🇮🇳 (@SudhaRamenIFS) March 25, 2021
Tn police personnel Krishna moorthy and biker @anny_arun shows that small act of kindness will make our lives beautiful. pic.twitter.com/QiSysVDTqvKudos to the good hearts who took pains for the old woman to get her pills which she had missed in the other bus.
— Sudha Ramen IFS 🇮🇳 (@SudhaRamenIFS) March 25, 2021
Tn police personnel Krishna moorthy and biker @anny_arun shows that small act of kindness will make our lives beautiful. pic.twitter.com/QiSysVDTqv
వీడియోలో.. బైకర్ (ఆనీ అరుణ్)ను ఆపి.. అతను కర్ణాటకకు చెందిన వాడేనా? అని పోలీసు ఆరాదీస్తాడు. అరుణ్ అవుననగానే.. 'ఇదే దారిలో ముందు ఓ కర్ణాటక బస్సు వెళ్తోంది. అందులో ఉన్న ఓ వృద్ధురాలు ఈ మందులు పోగొట్టుకున్నారు. కాస్త బస్సును ఛేజ్ చేసి ఇది ఆవిడకు అందించగలవా..' అని అడుగుతాడు పోలీసు.
దీంతో బస్సును ఛేజ్ చేసిన అరుణ్.. మందులను వృద్ధురాలికి అందిస్తాడు. ఈ వీడియోను షేర్ చేయకుండా ఉండలేకపోతున్నా అంటూ యూట్యూబ్‌లో దానిని పెట్టేశాడు. అంతే దానికి నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన లభిస్తోంది. పోలీసుతో పాటు అరుణ్‌ను వారు తెగ పొగిడేస్తున్నారు.
ఇదీ చూడండి: మూర్తీభవించిన మానవత్వం.. అనాథ శవాన్ని మోసిన మహిళా ఎస్సై