జవాన్ల ప్రాణాలను కాపాడేందుకు దిల్లీలో బైక్ అంబులెన్స్‌ను నేడు ప్రారంభంచినున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, సుక్మా, దంతేవాడ వంటి అటవీ ప్రాంతాల్లో ఎన్‌కౌంటర్లలో గాయాలపాలయ్యే జవాన్ల అత్యవసర చికిత్స కోసం 'రక్షిత' అనే బైక్ అంబులెన్స్‌లను తయారుచేశారు. వీటిని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్), ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ & అల్లీడ్ సైన్సెస్ (ఇన్మాస్), డీఆర్‌డీఓ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. వీటిని దిల్లీలో నేడు ప్రారంభించనున్నారు.
నక్సలైట్ ప్రభావిత ప్రాంతాలు, ఇరుకైనదారుల్లో సులువుగా చేరుకునేలా ఈ బైక్ అంబులెన్స్‌ను రూపొందించారు. ఈ అడవుల్లో సమయానికి వైద్యం అందక సామాన్య ప్రజలు, జవాన్లు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు అనేకం ఉన్నాయి.
ఇదీ చదవండి: మొదటి స్వదేశీ మెషీన్ గన్ అభివృద్ధి