Kashmiri Boy won 2 Crore in Dream11: జమ్ముకశ్మీర్‌కు చెందిన ఓ యువకుడు రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ యాప్ డ్రీమ్ 11లో పందెం వేసి 2 కోట్ల రూపాయలు గెలుచుకున్నాడు. కశ్మీర్‌లోని బిజబిహారకు చెందిన వసీం రాజా గత రెండేళ్లుగా డ్రీమ్11 లో క్రికెట్, హాకీ, ఫుట్‌బాల్, కబడ్డీ, బాస్కెట్‌బాల్ క్రీడల్లో బెట్టింగ్ వేసేవాడు. ఎప్పటిలాగే బెట్టింగ్ వేయగా అదృష్టం వరించి రెండు కోట్ల రూపాయలను గెలుచుకున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడం వల్ల నెటిజన్లు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
"నేను శనివారం రాత్రి నిద్రలో ఉండగా నా స్నేహితుడు ఫోన్ చేశాడు. నేను డ్రీమ్11లో పెట్టిన జట్టు మొదటి స్థానంలో ఉందని చెప్పాడు. దీంతో నేను లేచి చూడగా రెండు కోట్లు గెలుచుకున్నట్లు ఉంది. రాత్రికి రాత్రే కోటీశ్వరుడిని అవ్వడం నిజంగా ఓ కలగా అనిపిస్తుంది. మేము పేదరికంలో ఉన్నాం. దాని నుంచి బయట పడడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. నా తల్లి గత పదిహేను ఏళ్లుగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ డబ్బుతో నా తల్లికి చికిత్స చేయించగలను"
- వసీం రాజా, డ్రీమ్ 11 విజేత
గతంలోనూ కొందరు డ్రీమ్11లో బెట్టింగ్ పెట్టి కోట్లు గెలుచుకున్నారు. బిహార్ శారన్ జిలాల్లోని రసూల్పుర్కు చెందిన డ్రైవర్ రమేశ్ కుమార్ రూపాయలు 2 కోట్లు గెలుచుకున్నాడు. దీంతో అతడి ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది. అదే సమయంలో.. జూదం సరదాగా మొదలెడితే.. అదే వ్యసనంగా మారుతోంది. ఒక్కసారి అలవాటైతే ఇక మన కథ కంచికి చేరడం ఖాయంగా కనిపిస్తోంది. పందేల మోజులో పడి కొందరు కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసుకుంటున్నారు. హైదరాబాద్ అడ్డాగా కోట్ల రూపాయల బెట్టింగ్దందా జరుగుతోంది. బెట్టింగుల్లో నష్టపోయిన యువకులు మోసాలకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇదీ చదవండి: డ్రైవర్‌ను వరించిన అదృష్టం.. రాత్రికి రాత్రే రూ.2కోట్ల జాక్‌పాట్