బిహార్ ఎన్నికల సమరం తుది ఘట్టానికి చేరుకుంది. 243 అసెంబ్లీ స్థానాలకు మూడు దశలుగా పోలింగ్ నిర్వహించగా.. మంగళవారం ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్డీఏలోని అనుభవజ్ఞుల నుంచి మహాకూటమి నేతృత్వంలోని యువశక్తికి 'అధికార పీఠం' చేతులు మారుతుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాల నేపథ్యంలో.. దేశప్రజలు బిహార్ పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్నారు.
ఏర్పాట్లు పూర్తి...
ఓట్ల లెక్కింపు కోసం 38 జిల్లాల్లో 55 కేంద్రాలను ఏర్పాటు చేసింది ఈసీ. సీఆర్పీఎఫ్కు చెందిన 19 కంపెనీలను రంగంలోకి దించింది. స్ట్రాంగ్ రూమ్‌లు, ఓట్ల లెక్కింపు హాళ్ల వద్ద ఈ భద్రతా సిబ్బందిని మోహరించనుంది. శాంతిభద్రతల పరిరక్షణ కోసం మరో 59 కంపెనీలను దింపింది. ప్రతి కంపెనీలో 100 మంది సిబ్బంది ఉండనున్నారు. దీనితో పాటు స్థానిక పోలీసులు కూడా ఎప్పటికప్పుడు అధికారులకు తమ సహకారాన్ని అందించనున్నారు.
![Bihar readies for D-day amid predictions of change](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9486741_6.jpg)
ఇదీ చూడండి:- 'మద్య'ధరా సముద్రంలో నితీశ్ మునక!
అయితే ఇక్కడ చిక్కంతా కరోనాతోనే. వైరస్ నిబంధనలు పాటిస్తూ ఎన్నికలను సజావుగా నిర్వహించింది ఈసీ. కానీ ఓట్ల లెక్కింపు వేళ.. కేంద్రాల వద్ద ఆయా పార్టీల సభ్యులు గుమిగూడకుండా చూసుకోవడం ఇప్పుడు ఈసీ ముందు ఉన్న అతిపెద్ద సవాలు.
ఈ నేపథ్యంలో తగిన చర్యలు చేపట్టింది ఈసీ. లెక్కింపు కేంద్రాల వద్ద ప్రజలు గుంపుల్లో నిలబడకుండా.. ఇప్పటికే పలు ఆంక్షలను అమల్లోకి తీసుకొచ్చింది.
ఎగ్జిట్ పోల్స్ మాట...
బిహార్‌లో గత 15ఏళ్లుగా నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలో ఉంది. అయితే ఈసారి ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమికే ప్రజలు మొగ్గుచూపుతున్నట్టు అనేక ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్.. దేశంలో అత్యంత అనుభవజ్ఞులైన రాజకీయ నేతల్లో ఒకరైన నితీశ్‌ను ఓడిస్తారని తేల్చిచెబుతున్నాయి. ఈ పరిణామాలు బిహార్ సమరానికి మరింత ఉత్కంఠను జోడించాయి.
![Bihar readies for D-day amid predictions of change](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9486741_1.png)
![Bihar readies for D-day amid predictions of change](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9486741_2.png)
![Bihar readies for D-day amid predictions of change](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9486741_4.png)
![Bihar readies for D-day amid predictions of change](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9486741_5.png)
![Bihar readies for D-day amid predictions of change](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9486741_3.jpg)
మహాకూటమి గెలిస్తే.. కాంగ్రెస్, సీపీఐ, సీపీఐ-ఎమ్, సీపీఐ ఎమ్ఎల్ వంటి పార్టీలకు రాజకీయంగా కొంత ఊరట లభిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చూడండి:- 1,157 మంది నేర చరితుల భవితవ్యం తేలేది రేపే
ప్రముఖుల పోరు...
ఇప్పుడు అందరి చూపు ఆర్జేడీ యువనేత తేజస్వీ యాదవ్ పోటీచేస్తున్న రాఘోపుర్ పైనే. సిట్టింగ్ స్థానంలో మరోమారు గెలుపు రుచి చూడాలనుకుంటున్నారు తేజస్వీ. ఆయన తల్లిదండ్రులు లాలూప్రసాద్ యాదవ్, రబ్రీ దేవీ కూడా గతంలో ఈ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి చేరారు. తేజస్వీ సోదరుడు తేజ్‌ప్రతాప్ యాదవ్.. హసన్‌పుర్ నుంచి పోటీచేస్తున్నారు.
వీరితో పాటు రాష్ట్ర మంత్రులైన నంద్ కిషోర్ యాదవ్(పట్నా సాహెబ్), ప్రమోద్ కుమార్(మోతిహరి), రాణా రణ్దిర్(మధుబన్), సురేశ్ శర్మ(ముజఫర్‌పుర్), శర్వణ్ కుమార్(నలంద), జై కుమార్ సింగ్(దినార), కృష్ణనందన్ ప్రసాద్ వర్మ(జెహానాబాద్) భవితవ్యం మంగళవారం తేలనుంది.
ఇదీ చూడండి:- 'భారత్ మాతా కీ జై' అంటే వారికి ఇష్టం లేదు: మోదీ