ETV Bharat / bharat

రూ.3.5 కోట్లు విలువైన గంజాయి పట్టివేత

బిహార్​లో గంజాయి రవాణా చేస్తున్న ఆరుగురు వ్యక్తులను ఈఓడబ్ల్యూ అధికారులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.3.5కోట్లు విలువైన గంజాయి సహా ఓ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Bihar Police seize ganja worth Rs 3.5 crore, arrest 6 persons
రూ.3.5 కోట్లు విలువైన గంజాయి పట్టివేత
author img

By

Published : Feb 3, 2021, 7:18 PM IST

బిహార్​ గయాలో 240 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఎకనమిక్​ అఫెన్స్​ వింగ్(ఈఓడబ్ల్యూ) అధికారులు. దీని విలువ రూ.3.5 కోట్లు ఉంటుందని తెలిపారు. ఈ కేసులో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు తెలిపిన అధికారులు.. నిందితుల్లో గయా జిల్లాకు చెందిన ఎక్సైజ్​ ట్రైనీ సబ్-ఇన్​స్పెక్టర్​ సహా ఓ హోంగార్డు కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

కొన్ని కోట్లు విలువైన గంజాయి.. ఝార్ఖండ్​ నుంచి బిహార్​కు తరలిస్తున్నట్లు తమకు సమచారం అందిందని ఈఓడబ్ల్యూ అదనపు డీజీపీ నాయర్​ ఉస్సేన్​ ఖాన్​ తెలిపారు. దీంతో ఓ బృందంగా ఏర్పడిన పోలీసులు.. గయా జిల్లాలో ఎన్​హెచ్-2 రహదారిపై గంజాయిని తరలిస్తున్న వాహనాన్ని గుర్తించారని వివరించారు. ఆ వాహనాన్ని వెంబడించి బోధ్ ​గయాలో పట్టుకున్నారని చెప్పారు.

ఈ ఘటనతో సంబంధం ఉన్న ట్రైనీ ఎస్సై.. కారు డ్రైవర్​ వద్ద రూ.40 వేలు లంచం తీసుకున్నట్లు తెలిపిన అధికారులు.. వాహనం గమ్య స్థానం చేరుకున్నాక మరో రూ.5లక్షలు ఇవ్వాలని డిమాండ్​ చేసినట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: మతిస్థిమితం లేని వ్యక్తి కడుపులో కత్తి, రీఫిల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.