ETV Bharat / bharat

మరుగుదొడ్డిలోనే నివాసం.. మనవరాలే సర్వస్వం! - నలంద వార్త

బిహార్​లోని నలంద జిల్లాలో ఓ వృద్ధురాలు పబ్లిక్​ టాయిలెట్​లోనే తన మనవరాలితో కలిసి నివసిస్తోంది. గుడిసె కూలిపోగా.. మరుగుదొడ్డిలోనే కాలం వెళ్లదీస్తోంది. యాచిస్తూ తన మనవరాలిని పోషిస్తోంది.

woman live in toilet in nalanda
టాయిలెట్​లో నివసిస్తున్న వృద్ధురాలు
author img

By

Published : Jun 13, 2021, 1:31 PM IST

Updated : Jun 20, 2021, 3:10 PM IST

టాయిలెట్​లో నివసిస్తున్న వృద్ధురాలు

బిహార్​ నలంద జిల్లాలో ఓ వృద్ధురాలి దీనస్థితి కంటతడి పెట్టిస్తోంది. ప్రభుత్వం నిర్మించిన పబ్లిక్​ టాయిలెట్​లోనే తన మనవరాలితో కలిసి నివాసం ఉంటోంది.

కొడుకు మరణంతో..

జిల్లాలోని దిరిపుర్​ గ్రామంలో కౌశల్యా దేవి జీవితం సంతోషంగా ఉండేది. కోడలు కొడుకు మనవరాలితో కలిసి ఓ పూరి గుడిసెలో నివసించేది. అకస్మాత్తుగా.. ఉన్న ఇల్లు ఓ రోజు కూలిపోయింది. ఆ ప్రమాదంలోనే కొడుకు, కోడలు మరణించారు. ఇల్లు కూలిపోగా.. మనవరాలితో కలిసి.. గ్రామంలోని మరుగుదొడ్డిలోనే తలదాచుకోవాల్సి వచ్చింది కౌశల్యాదేవికి! ఎండా వాన నుంచి తమను తాము కాపాడుకోవాల్సి వస్తోంది. వృద్ధాప్యం మీదపడగా.. ఎవరూ ఎలాంటి పనిని కూడా ఇవ్వట్లేదు. దీంతో పొట్టనింపుకోవడానికి అందరి ముందు చేయి చాచాల్సిన దుస్థితి వచ్చింది ఆమెకు. అలా యాచిస్తూ.. మనవరాలిని పోషిస్తోంది.

"నా ఇల్లు కూలిపోగా.. దానితో పాటు నా సర్వస్వం కోల్పోయాను. ఈ లోకంలో నా మనవరాలు ఏం చేయగలదు? నేనే యాచిస్తూ ఎలాగోలా వెళ్లదీసుకొస్తున్నాను. వర్షాలు వచ్చినప్పుడు యాచన చేయలేను. నేనైతే ఆకలితో పడుకోగలను. కానీ ఖాళీ కడుపుతో నా మనవరాలును పడుకోపెట్టలేను."

-వృద్ధురాలు

"వృద్ధురాలికి ఆర్థిక స్తోమత లేదు. ఇప్పటికే ఆమె వృద్ధాప్య ఫించన్​ పొందుతోంది. రేషన్ బియ్యం ఇస్తున్నాము. కూలి పోయిన ఓ ఇల్లు ఉంది ఆమెకు. దానిని వీలైనంత త్వరలో నిర్మించడానికి ప్రయత్నస్తాము."

-రాధాకాంత్​, ఎస్​డీఎమ్​

ఇదీ చదవండి: 5 కి.మీ. భుజాలపై మోసి.. ఆస్పత్రిలో చేర్చి..

రైల్వే పోలీస్ సాహసం​​- ఆ ఇద్దరూ సేఫ్​!

Last Updated : Jun 20, 2021, 3:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.