ETV Bharat / bharat

సైకిల్​ను ఢీకొట్టి 8 కి.మీ ఈడ్చుకెళ్లిన కారు.. వ్యక్తి మృతి - bihar accident news

సైకిల్​ మీద వెళ్తున్న ఓ వ్యక్తిని కారు ఢీ కొట్టి 8 కిలోమీటర్ల మేర లాకెళ్లారు. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి మరణించాడు. బిహార్​లోని మోతిహరిలో జరిగింది ఈ ఘటన.

bihar man dies hit and dragged by car for 8km on nh 27
బిహార్ ఘోర రోడ్డు ప్రమాదం
author img

By

Published : Jan 22, 2023, 2:10 PM IST

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్లీ హిట్​ అండ్ రన్​ కేసు తరహ ఘటన మరోకటి జరిగింది. బిహార్​లోని మోతిహరిలో ఒక వ్యక్తిని కారు ఢీకొట్టి.. ఆపై 8 కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి మరణించాడు. ఈ ఘోర ప్రమాదం కొత్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని 27 నంబర్ జాతీయ రహదారిపై జరిగింది.

పోలీసుల వివరాల ప్రకారం
మోతిహారి నివాసముంటున్న శంకర్ సైకిల్​పై వెళుతున్నాడు. ఈ క్రమంలోనే గోపాల్​గంజ్​ వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి వచ్చి సైకిల్​ని ఢీకొట్టింది. దీంతో శంకర్​ ఎగిరిపడి కారు కింద ఉన్న క్యారేజీలో ఇరుక్కుపోయాడు. దీంతో అతడిని కారు 8 కిలోమీటర్ల దూరం లాక్కెల్లింది. ఆ తర్వాత డ్రైవర్ సహా అందులో ఉన్న ప్రయాణికుడు ఇద్దరూ కొత్వాలోని కదమ్ చౌక్ ప్రాంతంలో కారును ఆపి అక్కడి నుంచి పారిపోయారు.

"సమాచారం అందగానే జాతీయ రహదారి పక్కన ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశాము. పిప్రకోఠి పోలీస్ స్టేషన్ అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి కారును సీజ్ చేశారు. డ్రైవర్, కారులో ఉన్న ప్రయాణికులు పారిపోయారు. కారు రిజిస్ట్రేషన్ నంబర్​ సహాయంతో యజమానిని కనుక్కుంటాం" అని కొత్వా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అనుజ్ కుమార్ తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.