ETV Bharat / bharat

పేదరికంలో బిహార్ టాప్​​.. ఏపీ, తెలంగాణలో పరిస్థితి ఇలా...

దేశంలో తొలిసారి రాష్ట్రాల వారీగా పేదరిక సూచీని విడుదల చేసింది నీతి ఆయోగ్(niti aayog report on poverty)​. ఈ నివేదికలో బిహార్​ అత్యంత పేద రాష్ట్రంగా నిలవగా.. ఝార్ఖండ్​, ఉత్తర్​ప్రదేశ్​ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి(multidimensional poverty index 2021). మరోవైపు.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లోనూ భారీగా ప్రజలు పేదరికంలోకి జారుకున్నారు.

Niti Aayog
బహుముఖ పేదరిక సూచీ
author img

By

Published : Nov 26, 2021, 3:54 PM IST

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది పేదరికంలోకి జారుకున్నారు. భారత్​లోనూ ఈ పరిస్థితి మరింత దిగజారిందని నీతి ఆయోగ్​ బహుముఖ పేదరిక సూచీ(ఎంపీఐ)(multidimensional poverty index 2021) చెబుతోంది. 2015-16లో చేపట్టిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఆధారంగా తొలిసారి రాష్ట్రాల వారీగా పేదరిక సూచీని(niti aayog report on poverty) విడుదల చేసింది నీతి ఆయోగ్​. ఈ సూచీ ప్రకారం(POVERTY INDEX).. దేశంలో అత్యంత పేద రాష్ట్రంగా బిహార్​ నిలవగా.. ఆ తర్వాత ఝార్ఘండ్​, ఉత్తర్​ప్రదేశ్​ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.

బిహార్​లో 51.91 శాతం, ఝార్ఖండ్​లో 42.16శాతం, ఉత్తర్​ప్రదేశ్​లో 37.79 శాతం, మధ్యప్రదేశ్​లో 36.65, మేఘాలయలో 32.67శాతం మంది పేదరికంలోకి జారుకున్నారు.

చివరిస్థానంలో కేరళ..

పేదవారు అత్యంత తక్కువగా ఉన్న రాష్ట్రంగా కేరళ(0.71 శాతం) సూచీలో చివరిస్థానంలో నిలిచింది. ఆ తర్వాత గోవా(3.76శాతం), సిక్కిం(3.82శాతం), తమిళనాడు(4.89శాతం), పంజాబ్​(5.59శాతం) ఉన్నాయి.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​..

నీతి ఆయోగ్​ విడుదల చేసిన బహుముఖ పేదరిక సూచీ(multidimensional poverty index india) ప్రకారం తెలంగాణలో 13.74 శాతం మంది పేదవారు ఉన్నారు. రాష్ట్రాల వారీగా 18వ స్థానంలో నిలిచింది. మరోవైపు.. తెలంగాణతో పోలిస్తే, ఆంధ్రప్రదేశ్​ కాస్త మెరుగైన స్థానంలో ఉంది. 12.31 శాతం మందితో సూచీలో 20వ స్థానంలో నిలిచింది.

Niti Aayog
నీతి ఆయోగ్​ రూపొందించిన పేదరిక సూచీ

12 అంశాల ఆధారంగా..

ప్రపంచవ్యాప్తంగా అనుసరించే.. ఆక్స్​ఫర్డ్​ పావర్టీ, హ్యూమన్​ డెవలప్​మెంట్​ ఇనీషియేటివ్​(ఓపీహెచ్​ఐ), ద యునైటెడ్​ నేషన్స్​ డెవలప్​మెంట్​ ప్రోగ్రామ్​(యూఎన్​డీపీ) పద్ధతులను ఉపయోగించి భారత జాతీయ ఎంపీఐని(POVERTY INDEX) రూపొందించినట్లు నీతి ఆయోగ్​ తెలిపింది. ముఖ్యంగా ప్రజల ఆరోగ్యం, విద్య, జీవన విధానం వంటి మూడు కీలక అంశాలను బేరీజు వేసినట్లు తెలిపింది. అందులో పోషకాహారం, పిల్లలు, పెద్దవారి మరణాలు, పాఠశాల హాజరు, వంట గ్యాస్​, పారిశుద్ధ్యం​, తాగునీరు, విద్యుత్తు, పక్కా ఇళ్లు, బ్యాంకు ఖాతాలు వంటి 12 అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు.

కేంద్రపాలిత ప్రాంతాల్లో..

కేంద్ర పాలిత ప్రాంతాల్లో దాద్రనగర్​ హవేలీ అత్యధికంగా 27.36 శాతంతో పేదరికంలో(POVERTY INDEX) తొలిస్థానంలో ఉంది. ఆ తర్వాత జమ్ముకశ్మీర్​, లద్దాఖ్​లో 12.58 శాతం, దామన్​ దియూలో 6.82 శాతం, ఛండీగఢ్​లో​ 5,97శాతం, దిల్లీలో 4.79శాతం, అండమాన్​ నికోబార్​ ఐలాండ్స్​లో 4.30శాతం, లక్షాదీప్​లో 1.82శాతం, పుదుచ్చేరిలో 1.72శాతం మంది పేదరికంలో ఉన్నారు.

ఇదీ చూడండి: 'రాజ్యాంగ బలంతోనే అభివృద్ధి పథంలో దేశం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.