ETV Bharat / bharat

పశువైద్యుడి కిడ్నాప్.. మహిళతో బలవంత వివాహం.. వీడియో వైరల్ - వైద్యుడి కిడ్నాప్ బలవంతపు పెళ్లి

BIHAR FORCED MARRIAGE: బిహార్​లో ఓ పశువైద్యుడిని కిడ్నాప్ చేసి బలవంత వివాహం జరిపించారు. దీనిపై పశువైద్యుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వివాహానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం స్థానికంగా వైరల్ అవుతోంది.

BIHAR FORCE MARRIAGE
BIHAR FORCE MARRIAGE
author img

By

Published : Jun 15, 2022, 11:00 AM IST

Updated : Jun 15, 2022, 12:04 PM IST

వైరల్ అవుతున్న వివాహ వీడియో

Doctor kidnap force marriage: వెటర్నరీ డాక్టర్​ను కిడ్నాప్ చేసి ఓ మహిళతో బలవంతంగా వివాహం జరిపించారు. బిహార్ బెగూసరాయ్ జిల్లాలోని పిధౌలీ గ్రామంలో ఈ ఘటన జరిగింది. పశువులకు జబ్బు చేసిందని చెప్పి వెటర్నరీ డాక్టర్​ సత్యం కుమార్​కు.. హసన్​పుర్​కు చెందిన విజయ్ సింగ్ అనే వ్యక్తి ఫోన్ చేశాడు. చికిత్స కోసం హసన్​పుర్​కు సత్యం వెళ్లాడు. ఈ క్రమంలోనే విజయ్.. సత్యంను కిడ్నాప్ చేశాడు. ఓ మహిళతో వివాహం జరిపించాడు. ఇప్పటికీ సత్యం జాడ దొరకలేదు. బాధితుడి తండ్రి సుబోధ్ కుమార్ ఝా ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముగ్గురిపై కేసు పెట్టారు. నిందితుల కోసం పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదని బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపారు.

BIHAR FORCE MARRIAGE
సత్యం వివాహం

ఇదిలా ఉండగా.. ఇందుకు సంబంధించి ఓ వీడియో బయటకు వచ్చింది. సత్యం ఓ మహిళతో వివాహం చేసుకుంటున్న వీడియో స్థానికంగా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. పెళ్లి దుస్తుల్లో ఉన్న సత్యం.. ఓ మహిళ చెయ్యిలో చెయ్యి వేసి వేద మంత్రాల మధ్య వివాహం చేసుకుంటున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఇది నిజంగా బలవంతంగా జరిగిన పెళ్లేనా? లేదా ఇష్టంతోనే సత్యం వివాహం చేసుకున్నాడా అన్నది తేలాల్సి ఉంది. బాధితుడిని సంప్రదించేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించినా ఫలితం లేదు.

బిహార్​లో బలవంతపు పెళ్లిళ్లు తరచుగా జరుగుతుంటాయి. కట్నం ఇవ్వలేని కుటుంబాలు బాగా స్థిరపడిన బ్యాచ్​లర్ అబ్బాయిలను కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లిళ్లు జరిపిస్తుంటాయి. బెగూసరాయ్​లో ఈ సంప్రదాయం 1970ల్లో ప్రారంభమైంది. అయితే, ప్రస్తుతం ఇలాంటి వివాహాలు తగ్గిపోయాయని ఎస్పీ యోగేంద్ర కుమార్ తెలిపారు. తాజా కేసుపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

Last Updated : Jun 15, 2022, 12:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.