Power Cuts At Hospital: బిహార్ ససారం జిల్లా ప్రాంతీయ ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వల్ల.. సెల్‌ఫోన్ లైట్ల మధ్యే రోగులకు చికిత్స అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎమర్జెన్సీ వార్డులో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో రోగులకు వైద్యసేవలు అరకొరగా అందుతున్నాయి. ఉక్కపోత భరించలేక.. దోమల బాధ తట్టుకోలేక రోగులతో పాటు సహాయకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎవరూ తమను పట్టించుకోవడం లేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఇవీ చదవండి: ఇత్తడి బిందెలో ఇరుక్కున్న బాలుడు.. ఇనుప గ్రిల్స్‌లో మరో చిన్నారి...
'స్పైడర్ మ్యాన్' సాహసాలతో వరుస చోరీలు.. అడ్డంగా కెమెరాకు చిక్కి..!