ETV Bharat / bharat

శ్మశానవాటికలో నీళ్లు- బోటులోనే అంత్యక్రియలు! - వరద నీటిలో అంతిమసంస్కారాలు

భారీ వర్షాల కారణంగా శ్మశానవాటికలో వరద నీరు చేరి.. ఓ గ్రామప్రజలు నానా అవస్థలు పడ్డారు. ఓ వ్యక్తి మృతదేహాన్ని వరదనీటిలోనే, బోటుపై తీసుకువెళ్లి అంతిమసంస్కారాలు నిర్వహించారు. ఈ ఘటన బిహార్​లోని దర్భంగా జిల్లాలో జరిగింది.

funeral problems with floods
వరదనీటిలో అంత్యక్రియలు
author img

By

Published : Jul 21, 2021, 1:46 PM IST

అంత్యక్రియలకు మహిసౌత్​ గ్రామప్రజల ఇక్కట్లు

భీకర వర్షాలు బిహార్​ను అతలాకుతలం చేస్తున్నాయి. దర్భంగా జిల్లాలో కమలా, కోసి, బాగమతి, అధ్వారా నదులు ఉప్పొంగుతుండగా.. ఆ జిల్లా వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరదల ప్రభావంతో.. అనేక గ్రామాలు జలమయమయ్యాయి. శ్మశానవాటికల్లో నీరు చేరడం వల్ల.. అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆయా గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు.

వెదురు బొంగులతో..

మహిసౌత్ గ్రామంలో 90 ఏళ్ల సినోయ్​ యాదవ్​ సోమవారం మృతి చెందాడు. అతడి అంత్యక్రియలు నిర్వహించేందుకు మృతుడి బంధువులు నానా ఇక్కట్లు పడ్డారు. నీళ్లతో నిండిపోయిన శ్మశానవాటికలోనే.. వెదురు కర్రలతోనే ఒక వంతెనలాంటిది నిర్మించి, దానిపై ఓ సిమెంటు తొట్టిని ఏర్పాటు చేశారు. అందులో కర్రలు నింపి మృతదేహాన్ని దహనం చేశారు.

funeral on boats
బోటులో అంతిమయాత్ర
last rites in water
వరదనీటిలో అంత్యక్రియల ఏర్పాట్లు
funeral on boats
బోటులపై అంతిమయాత్ర

కాష్ఠం చుట్టూ బోటులోనే..

బోటులోనే బ్యాండు బాజా మోగిస్తూ.. సినోయ్​ యాదవ్​ అంతిమయాత్ర నిర్వహించారు గ్రామస్థులు. కాష్ఠం చుట్టూ.. బోటులోనే మృతుడి బంధువులు తిరుగుతూ.. మృతదేహానికి నిప్పంటించారు.

last rites in water in darbhanga bihar
నీళ్లలోనే మృతదేహాన్ని దహనం చేస్తున్న దృశ్యాలు

ఇదీ చూడండి: సెల్​ఫోన్ టార్చ్ వెలుతురులోనే రోగికి చికిత్స

ఇదీ చూడండి: పెళ్లి భోజనం తిని 60 మందికి అస్వస్థత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.