ETV Bharat / bharat

అఖిలపక్ష బృందంతో ప్రధానిని కలవనున్న నితీశ్

author img

By

Published : Aug 22, 2021, 5:37 AM IST

కులాలవారీగా జనగణన చేపట్టాలని కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు సిద్ధమయ్యారు బిహార్ మఖ్యమంత్రి నితీశ్ కుమార్. ఈ మేరకు అఖిలపక్ష బృందంతో ప్రధానిని కలవడానికి సిద్ధమయినట్లు తెలిపారు.

nitish, bihar cm
నితీశ్, బిహార్ ముఖ్యమంత్రి

దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని పట్టుబడుతున్న బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌.. మరోసారి కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు సిద్ధమయ్యారు. బిహార్‌లో ఉన్న అన్ని రాజకీయ పార్టీల నుంచి ఒక్కో ప్రతినిధి చొప్పున 11 మంది సభ్యుల బృందంతో కలిసి ప్రధాని మోదీతో సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రధానిని సమయం కోరారు.

కేంద్రం గత నెలలో.. పార్లమెంటులో ఎస్సీ, ఎస్టీల జనాభా మాత్రమే లెక్కించాలని చేసిన ప్రకటన నేపథ్యంలో కుల గణన అంశం బయటకొచ్చింది. బిహార్ వంటి రాష్ట్రాల్లో మండల్ కమిషన్‌ కాలం నుంచే ఓబీసీలదే రాజకీయాలపై ఆధిపత్యం కొనసాగుతోంది. వెనుకబడిన తరగతుల వారు ఎక్కువగా ఉండటం వల్ల కులగణన చేపట్టాలని బిహార్‌ రాజకీయ పార్టీలు ఎప్పటినుంచో కోరుతున్నారు. అసెంబ్లీలోనూ తీర్మానం చేశారు. కానీ కేంద్రం ఇందుకు విముఖంగా ఉంది. ఈ నేపథ్యంలో అఖిలపక్ష బృందంతో ప్రధానిని కలవడానికి నితీశ్ సిద్ధమయ్యారు.

ఇదీ చదవండి:జనాభా లెక్కల సేకరణలో కులగణన లేనట్లే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.