ETV Bharat / bharat

భారత్​లోనే ఎత్తైన క్లాక్​టవర్​ ఎక్కడుందంటే...

నవాబుల నగరంగా పేరుగాంచిన లఖ్‌నవూ.. ఎత్తైన భవనాలకు ప్రసిద్ధి. వాటిని చూస్తే ఒకింత ఆశ్చర్యం, మరింత సంతోషం కలుగుతుంది. రాజుల కాలం నాటి నగరంలోని చారిత్రక కట్టడాలు అందరికీ సుపరిచితమే. కానీ అతిపెద్ద క్లాక్‌టవర్‌ అక్కడే ఉందన్న విషయం చాలా వరకు తెలియదు. దేశంలోనే అతి పెద్ద క్లాక్‌ టవర్‌ విశిష్టతపై ప్రత్యేక కథనం.

biggest-clock-of-india-is-in-lucknow-clock-tower
భారత్​లోనే ఎత్తైన క్లాక్​టవర్​
author img

By

Published : Dec 7, 2020, 8:40 AM IST

భారత్​లోనే ఎత్తైన క్లాక్​టవర్​ ఎక్కడుందంటే...

ఉత్తర్​ప్రదేశ్​ పాత లఖ్‌నవూ పరిధిలోని హుసేనాబాద్‌లో ఎత్తైన క్లాక్‌ టవర్‌ ఉంది. 221 ఫీట్ల ఎత్తులో ఈ క్లాక్‌ టవర్‌ను నిర్మించారు. దీన్నిచూసిన వారెవరైనా అబ్బురపోతారు. ఎలాంటి వనరులు, సదుపాయాలు లేనికాలంలో ఎత్తయిన క్లాక్‌ టవర్‌ నిర్మించారంటే ఆశ్చర్యం కలుగుతుంది. బ్రిటీష్‌ వాస్తుకళా రూపాల్లోనే ఈ క్లాక్‌టవర్‌ అత్యుత్తమ నమూనాగా నిలుస్తుందని చారిత్రకారులు చెబుతున్నారు. లెఫ్టినెంట్‌ సర్‌ జార్జ్‌ కూపర్‌ గౌరవార్థం 1882 నుంచి 1887 మధ్య ఈ క్లాక్‌టవర్‌ నిర్మాణం జరిగింది. ఈ క్లాక్‌ టవర్‌ నిర్మాణానికి ఇటుకలు, సున్నం వాడారు. 221 ఫీట్ల ఎత్తయిన ఈ క్లాక్‌ టవర్‌ నిర్మాణానికి రూ.90 వేలు వెచ్చించారు.

biggest-clock-of-india-is-in-lucknow-clock-tower
భారత్​లోనే ఎత్తైన క్లాక్​టవర్​
biggest-clock-of-india-is-in-lucknow-clock-tower
భారత్​లోనే ఎత్తైన క్లాక్​టవర్​

అరుదైన గడియారం..

ఈ క్లాక్‌టవర్‌లో భారీగడియారాన్ని ఏర్పాటు చేశారు. ఈ గడియారాన్ని బ్రిటన్‌కు చెందిన జేడబ్ల్యూ బేసన్ కంపెనీ తయారుచేసింది. ప్రపంచంలోనే ఇలాంటి గడియారాలు మొత్తం 3 ఉన్నట్లు చరిత్రకారులు తెలిపారు. అయినప్పటికీ దేశంలోనే అతిపెద్ద గడియారంగా క్లాక్‌టవర్‌లోని గడియారం గుర్తింపు సాధించింది. ఈ గడియారం ఆరు ఫీట్ల పొడవు, నాలుగు ఫీట్ల వెడల్పు ఉంటుంది. ఇత్తడితో చేసిన గడియారం మిషన్‌లోని ఒక్కే గేర్‌ 50 కిలోల బరువు ఉంటుంది. అప్పట్లో ఈ గడియారం విలువ 27 వేల రూపాయలని చరిత్రకారులు తెలిపారు.

దాదాపు వందేళ్లు నిరంతరాయంగా పనిచేసిన ఈగడియారం 1984లో ఆగిపోయింది. ఈ గడియారాన్ని బాగుచేసేందుకు అప్పట్లో పెద్ద యజ్ఞమే చేయాల్సి వచ్చింది. ఎందుకంటే మూడు దశాబ్దాలపాటు శ్రమించాల్సి వచ్చింది. ఈ గడియారాన్ని బాగు చేయించేందుకు లఖ్‌నవూకు చెందిన ఇంజినీర్‌, మరికొందరు కలిసి చేసిన ప్రయత్నాలు 2013లో ఫలించాయి. క్లాక్‌టవర్‌ నిర్వహణ సరిగ్గా లేక ఆ గడియారం పరికరాలన్నీ చోరీకి గురయ్యాయి. ఇంజనీర్‌ బృందం ఎన్నో వ్యయప్రయాసలు పడి గడియారం పరికరాలను స్థానికంగా తయారుచేయించింది. దీని కోసం రూ.18లక్షలు ఖర్చుచేశారు. మరమ్మతులు పూర్తి అయినందున క్లాక్‌ టవర్‌లోని గడియారం.. లఖ్‌నవూ నగరానికి ప్రధాన ఆకర్షణగా మారింది.

భారత్​లోనే ఎత్తైన క్లాక్​టవర్

ఇదీ చూడండి: ఫుట్​బాల్​ను ఆటాడేసిన 'అఖిల'కు ప్రపంచ రికార్డు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.