'బిగ్ బీ... పెద్ద మనసు చేసుకోండి' అంటూ మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన కార్యకర్తలు అమితాబ్ బచ్చన్ ఇంటి మందు బ్యానర్లు కట్టారు. ముంబయి జుహూలోని అమితాబ్ ఇంటి ముందు వీటిని ఏర్పాటు చేశారు.
రోడ్డు విస్తరణ కోసం తన ఇంటి కాంపౌండ్ గోడను కూల్చేందుకు అమితాబ్ సహకరించాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఆ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలు ఉన్నట్లు పేర్కొన్నారు.
"బిగ్ బీని పెద్ద మనసు చేసుకోవాలని మేం కోరుతున్నాం. విస్తరణ కోసం రోడ్డు హద్దులను గుర్తించేందుకు ఉత్తర్వులు జారీ చేసినట్లు సివిల్ సర్వే అధికారులు మాతో చెప్పారు. సమస్య ఎనిమిది రోజుల్లో పరిష్కారం అవుతుందని హామీ ఇచ్చారు. దీనిపై ఎలాంటి పురోగతి లేకుంటే మా నిరసనను ఉద్ధృతం చేస్తాం."
-నవ నిర్మాణ సేన కార్యకర్త
రోడ్డు విస్తరణ కోసం అమితాబ్ ఇంటిలోని ఓ భాగాన్ని కూల్చే విషయంపై 2017లోనే ఆయనకు బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) నోటీసులు జారీ చేసింది. అయితే దీనికి అమితాబ్ ఇంతవరకు స్పందించలేదు. ప్రస్తుతం ఆ నోటీసులపైనే బీఎసీ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. రోడ్డు విస్తరణ కోసం ఎంతమేరకు ఇంటిని కూల్చాలనే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఇదీ చదవండి: జనావాసాల్లోకి మొసలి- పట్టుకుని, ఆటో ఎక్కించి...