ETV Bharat / bharat

'సాగు చట్టాల విషయంలో విపక్షాలది వృథా ప్రయాస' - సాగు చట్టాలపై కాంగ్రెస్​ విమర్శలు

సాగు చట్టాలపై రైతులను తప్పుదోవ పట్టించేందుకు విపక్షాలు చేస్తున్న ప్రయత్నాలు విజయవంతం కావని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. హిమాచల్​ ప్రదేశ్​లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సంస్కరణ ఫలితాలు కనిపించాలంటే.. రెండేళ్లు వేచిచూడాలన్నారు.

Bid to mislead farmers will not succeed: Rajnath Singh
'రైతులను తప్పుదోవపట్టంచడంలో ప్రతిపక్షాలు విఫలం'
author img

By

Published : Dec 27, 2020, 7:05 PM IST

Updated : Dec 27, 2020, 7:21 PM IST

వ్యవసాయ చట్టాలపై రైతులను తప్పుదోవ పట్టించేలా విపక్షాలు చేస్తోన్న ప్రయత్నాలు ఫలించవని రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్ వెల్లడించారు. నూతనంగా తీసుకువచ్చిన సాగు చట్టాలు రైతుల ఆదాయం పెంచుతాయని పేర్కొన్నారు. హిమాచల్​ప్రదేశ్​లో భాజపా ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు రాజ్​నాథ్​.

ఏ రంగంలో అయినా సంస్కరణలు పూర్తి స్థాయిలో ఫలితాలు చూపించాలంటే కొంత సమయం పడుతుందని అభిప్రాయపడ్డారు కేంద్రమంత్రి. 1991లో మన్మోహన్​ సింగ్​, ఆ తర్వాత వాజ్​పేయి ప్రభుత్వంలో తీసుకువచ్చిన ఆర్థిక సంస్కరణలు సత్​ఫలితాలు ఇవ్వడానికి నాలుగైదు ఏళ్లు పట్టినట్లు గుర్తు చేశారు. అదే విధంగా కొత్త వ్యవసాయ చట్టాలు కూడా ఫలితాలు ఇవ్వాలంటే కనీసం రెండేళ్లైనా వేచి చూడాలన్నారు.

మరోవైపు సాగుచట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దులో రైతుల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎముకలు కొరికే చలిలోనూ అన్నదాతలు తమ డిమాండ్ల కోసం పోరాడుతున్నారు.

ఇదీ చూడండి: 'అప్పుడలా.. ఇప్పుడిలా.. ఏంటిది రాహుల్​ జీ?'

Last Updated : Dec 27, 2020, 7:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.