ETV Bharat / bharat

గుజరాత్​ సీఎం భూపేంద్ర పటేల్​ రాజీనామా.. 12న ప్రమాణ స్వీకారం

గుజరాత్​ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తన రాజీనామాను గవర్నర్​ ఆచార్య దేవవ్రత్​కు సమర్పించారు. మరోసారి సీఎంగా ఆయన డిసెంబర్​ 12న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ​ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్‌ షా హాజరుకానున్నారు.

bhupendra patel resignation
bhupendra patel resignation
author img

By

Published : Dec 9, 2022, 1:10 PM IST

Updated : Dec 9, 2022, 6:51 PM IST

Gujarat CM Bhupendra Patel: గుజరాత్​ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన భాజపా.. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్.. శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని రాజ్​ భవన్​కు వెళ్లి గవర్నర్ ఆచార్య దేవవ్రత్​కు సమర్పించారు.

bhupendra patel resignation
రాజ్​ భవన్​లో గవర్నర్​కు పుష్పగుచ్ఛం ఇస్తున్న భూపేంద్ర పటేల్​

మరోవైపు, శనివారం గాంధీనగర్​లోని పార్టీ కార్యాలయంలో గుజరాత్​కు కాబోయే ముఖ్యమంత్రిని ఎన్నుకునేందుకు కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది భాజపా. ఈ సమావేశానికి పరిశీలకులుగా పార్టీ సీనియర్​ నేతలు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్​, యడియూరప్ప, అర్జున్ ముండా నియమితులయ్యారు.

కాగా, రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ కొనసాగుతారని భాజపా గతంలోనే ప్రకటించింది. ముఖ్యమంత్రిగా ఆయన రెండోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. డిసెంబర్‌ 12వ తేదీన ఈ కార్యక్రమం ఘనంగా జరగనుంది. దీనికి ప్రధాని నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్‌షా సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.

2022 ఎన్నికల్లో కాంగ్రెస్‌ దాదాపు 50కిపైగా సీట్లను కోల్పోగా.. ఆ మేరకు భాజపా లబ్ధిపొందింది. భాజపా అధికారంలోకి రావడం వరుసగా ఇది ఏడోసారి. 1985లో జరిగిన ఎన్నికల్లో 149 స్థానాల్లో గెలుపొంది కాంగ్రెస్​ రికార్డు సృష్టిస్తే.. ఈసారి భాజపా 156 సీట్లు సాధించి ఆ రికార్డును తిరగరాసింది.

Last Updated : Dec 9, 2022, 6:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.