సహజ రంగులను వినియోగించి ప్రపంచంలోనే అతిపెద్ద పెయింటింగ్ వేసి.. గిన్నిస్‌బుక్‌లో చోటు దక్కించుకుంది బెనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి(బీహెచ్‌యూ) చెందిన విద్యార్థిని నేహా సింగ్.
"నేహా సింగ్.. సహజ వర్ణాలతో 62.72 చదరపు మీటర్లతో ప్రపంచంలోనే అతిపెద్ద పెయింటింగ్ వేశారు. 'మోక్షా కా వృక్ష్'(మోక్షానికి చెట్టు) పెయింటింగ్ వేశారు. దీనికి గాను ఆమెకు గిన్నిస్ బుక్‌లో చోటు దక్కింది,' అని బల్లియా జిల్లా మేజిస్ట్రేట్ శ్రీహరి ప్రతాప్ షాహి తెలిపారు.
రస్రా ప్రాంతానికి చెందిన నేహా.. బీహెచ్‌లో వేద శాస్త్రం చదువుతోంది.
ఇదీ చూడండి: కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు శుభవార్త