ETV Bharat / bharat

భీమా-కోరెగావ్ కేసులో సుధా భరద్వాజ్​కు బెయిల్​ - accused in bhima koregoan

Bhima koregoan case: భీమా-కోరెగావ్ కేసులో నిందితురాలు సుధా భరద్వాజ్​కు బాంబే హైకోర్టు డీఫాల్ట్​ బెయిల్ మంజూరు చేసింది. అయితే.. వరవరరావు, సుధీర్ ధావలే సహా 8 మంది నిందితులు పెట్టుకున్న బెయిల్ అభ్యర్థనలను న్యాయస్థానం తోసిపుచ్చింది.

Elgar Parishad case, bombay high court, sudha bharadwaj bail
సుధా భరద్వాజ్, ఎల్గార్ పరిషత్ కేసు
author img

By

Published : Dec 1, 2021, 11:56 AM IST

Updated : Dec 1, 2021, 1:17 PM IST

Bhima koregoan case: భీమా-కోరెగావ్​ కేసులో నిందితురాలు, న్యాయవాది, సామాజిక కార్యకర్త సుధా భరద్వాజ్​కు బాంబే హైకోర్టులో ఊరట లభించింది. సుదా భరద్వాజ్​కు న్యాయస్థానం డీఫాల్ట్​ బెయిల్ మంజూరు చేసింది. అయితే.. ఇదే కేసులో వరవరరావు, సుధీర్ ధావలే సహా 8 మంది నిందితుల డీఫాల్ట్​ బెయిల్ అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది.

Sudha bharadwaj bail: ఈ కేసులో నిందితులు పెట్టుకున్న బెయిల్ పిటిషన్​పై జస్టిస్ ఎస్​ఎస్ షిందే, జస్టిస్ ఎన్​జే జామాద్​లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. సుధా భరద్వాజ్ బెయిల్ పొందేందుకు అర్హురాలని తెలిపింది. బైకుల్లా మహిళా కారాగారంలో ఉన్న ఆమెను డిసెంబరు 8న ముంబయిలో ఎన్​ఐఏ ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరు పరచాలని ధర్మాసనం ఆదేశించింది. ఆమె బెయిల్ షరతులు, విడుదల తేదీపై నిర్ణయం తీసుకోవాలని చెప్పింది.

భీమా-కొరేగావ్ కేసులో అరెస్టైన 16 మంది నిందితుల్లో డీఫాల్ట్​ బెయిల్ పొందిన వారిలో సుధా భరద్వాజ్​ తొలి వ్యక్తి. కవి, సామాజిక కార్యకర్త వరవరరావు ప్రస్తుతం మెడికల్​ బెయిల్​లో ఉన్నారు. మరో నిందితుడు హక్కుల నేత స్టాన్ స్వామి మెడికల్ బెయిల్ కోసం ఎదురుచూస్తున్న క్రమంలో అనారోగ్యంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జులై 5న మరణించారు. మిగతా వాళ్లంతా ప్రస్తుతం విచారణ ఖైదీలుగా కస్టడీలో ఉన్నారు.

ఇదీ చూడండి: భీమా-కోరెగావ్ కేసులో మరో 8 మందిపై ఛార్జిషీటు​

ఇదీ చూడండి: స్టాన్​ స్వామి మృతిపై రాష్ట్రపతికి విపక్షాల లేఖ

Last Updated : Dec 1, 2021, 1:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.