Bhilwara Gang rape: రాజస్థాన్ అల్వార్‌లో బధిర బాలికపై అత్యాచారం ఘటన మరువక ముందే అలాంటిదే మరొకటి వెలుగుచూసింది. భిల్వాడాలో ఓ 18 ఏళ్ల దివ్యాంగురాలు.. రెండు నెలల క్రితం సామూహిక అత్యాచారానికి గురైంది. మూగ, చెవిటి అయిన బాధితురాలు.. అప్పుడు వారి కుటుంబసభ్యులకు ఈ విషయం అర్థమయ్యేలా చెప్పలేకపోయింది. ఆమెపై రేప్ జరిగినట్లు తాజాగా తెలిసింది.
వివరాల ప్రకారం.. సోమవారం ఆ బాలిక తీవ్ర కడుపునొప్పితో బాధపడింది. రక్తస్రావం కూడా అయింది. వెంటనే ఆమె సోదరి.. స్థానికంగా ఉండే మహాత్మాగాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లింది. వైద్యులు పరీక్షించగా.. బాలిక గర్భవతి అని తేలింది. వారు పోలీసులు, అధికారులకు సమాచారం ఇచ్చారు.
ఆస్పత్రికి చేరుకున్న అధికారులకు.. బధిర బాలిక చెప్పేది అర్థం కాలేదు. మూగ భాషను అర్థం చేసుకొనే నిపుణులను పిలిపించగా.. అసలు విషయం తెలిసింది. రెండు నెలల క్రితం వ్యవసాయ పనులు చేస్తుండగా తనపై ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఆమె వివరించింది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులను వెతికే పనిలో పడ్డారు.
నిద్రిస్తుండగా ఎత్తుకెళ్లి..
రాజస్థాన్‌లోనే బరన్ జిల్లాలో మరో అత్యాచార ఘటన వెలుగుచూసింది. ఇంట్లో నిద్రిస్తుండగా.. ఇద్దరు వ్యక్తులు బలవంతంగా ఎత్తుకెళ్లి రేప్ చేశారని ఓ బాలిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇవీ చూడండి: రాజస్థాన్ 'అల్వార్ రేప్ కేసు' సీబీఐ చేతికి..!
'ఆమెపై గ్యాంగ్‌రేప్ జరగలేదు.. కానీ జననాంగాలపై తీవ్ర గాయాలు!'