Bharatpur Transgender Neetu : ప్రతీ ఏటా పది మంది పేద కుటుంబాలకు చెందిన అమ్మాయిలకు వివాహాలు చేస్తూ గొప్ప మనసు చాటుకుంటున్నారు ఓ ట్రాన్స్‌జెండర్. గత 12 ఏళ్ల నుంచి ఇప్పటివరకూ 120 మంది అమ్మాయిలకు పెళ్లిళ్లు చేశారు ట్రాన్స్‌జెండర్. ఈ ఏడాది కూడా ఓ పదిమంది అమ్మాయిలకు వివాహాలను చేశారు. ఆమే రాజస్థాన్‌కు చెందిన నీతూ. ఆ ప్రాంత ప్రజలు నీతూ ఆంటీ అని ఆమెను ముద్దుగా పిలుచుకుంటారు. నీతూ స్వస్థలం భరత్‌పుర్.
పన్నెండేళ్ల క్రితం అందరి ట్రాన్స్జెండర్ల మాదిరిగానే నీతూ కూడా ప్రజల ఇళ్లకు వెళ్లి వారిని దీవించేవారు. ఈ క్రమంలోనే పేద కుటుంబాలకు చెందిన అమ్మాయిలకు పెళ్లిళ్లు చేయడానికి వారి తల్లిదండ్రులు పడే ఇబ్బందులను నీతూ కళ్లారా చూశారు. అలాంటి వారికోసం ఏదైనా మంచి పనిచేయాలనుకున్నారు. ఈ క్రమంలో కొందరు యువతులకు వివాహాలు చేశారు. ఆ తర్వాత ప్రతి ఏటా ఓ పదిమంది హిందూ-ముస్లిం అమ్మాయిలకు పెళ్లిళ్లు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విధంగా గత పన్నెండేళ్లుగా పేద యువతులకు వివాహాలు చేస్తున్నారు నీతూ.
"కన్యాదానానికి మించిన గొప్పదానం లేదు. పేద కుటుంబాలకు చెందిన అమ్మాయిలకు వివాహాలు చేయడం వల్ల నాకు చాలా సంతృప్తి కలుగుతుంది. భవిష్యత్‌లో మరింత మంది పేద పిల్లలకు పెళ్లిళ్లు చేయాలనుకుంటున్నాను. "
-నీతూ, ట్రాన్స్ జెండర్.
నీతూ నిర్వహించే ఈ సామూహిక వివాహాల్లో కళ్యాణమండపంలో వేదమంత్రాలు, నిఖా శబ్దాలు వినిపిస్తాయి. సోమవారం పాయ్బాగ్లో ఉన్న కళ్యాణ మండపంలో 10 మంది అమ్మాయిలకు పెళ్లిళ్లు చేశారూ నీతూ. ఒకే వేదికపై జరిగిన ఈ వివాహ వేడుక ఘనంగా జరిపించారు. కన్యాదానానికి కావాల్సిన బంగారం, వెండి ఇతర వస్తువులనూ నీతూనే సమకూర్చారు. ఈ విధంగా ఎన్నో పేద కుటుంబాలకు చెందిన అమ్మాయిలకు వివాహం చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపారు.
కొద్ది రోజుల క్రితం.. పంజాబ్ అమృత్‌సర్‌లో ఓ వింత ప్రేమ కథ వెలుగులోకి వచ్చింది. ఒక యువకుడు, ట్రాన్స్‌జెండర్ ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. అనంతరం పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసి జీవించాలనుకున్నారు. అందుకోసం ఆపరేషన్ చేయించుకుని అమ్మాయిగా మారాడు.. మొత్తం స్టోరీ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
ఇంట్లోనే కుంకుమ పువ్వు సాగు- కృత్రిమంగా కశ్మీర్ వాతావరణం, ఎలాగో తెలుసా?
ఐదుగురు పిల్లలతో బైక్‌పై తండ్రి ప్రయాణం- ఆసుపత్రిలో ఆరో కుమారుడు- పోలీసులకు ఫన్నీ సమాధానం