ETV Bharat / bharat

జకీర్​ నాయక్​ ఖాతాల్లో కోట్లాది అక్రమ నిధులు - ISLAMIC PREACHER

వివాదాస్పద ఇస్లామిక్​ మతప్రబోధకుడు జకీర్​ నాయక్​కు చెందిన ట్రస్టు, వ్యక్తిగత ఖాతాల్లో కోట్ల రూపాయల నిధులు విరాళాల రూపంలో సమకూరినట్లు ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్ ​(ఈడీ ) వెల్లడించింది. ఈ బ్యాంకు డిపాజిట్లన్నీ శ్రేయోభిలాషులు అనే పేరుతో వచ్చినందు వల్ల దాతల వివరాలు గుర్తించలేక పోయినట్లు అధికారులు తెలిపారు.

జకీర్​ నాయక్​ ఖాతాల్లో కోట్లాది అక్రమ నిధులు
author img

By

Published : May 26, 2019, 5:40 PM IST

Updated : May 26, 2019, 11:06 PM IST

జకీర్​ నాయక్​ ఖాతాల్లో కోట్లాది అక్రమ నిధులు

ఇస్లామిక్ మతప్రబోధకుడు జకీర్ నాయక్​పై ముస్లిం యువతను తీవ్రవాదం వైపు దారిమళ్లిస్తున్నారనే ఆరోపణలున్నాయి. తాజాగా జకీర్ నాయక్​కు అక్రమ మార్గంలో కోట్లాది రూపాయల విరాళాలు అందినట్లు ఎన్​పోర్స్​మెంట్ డైరెక్టరేట్​ గుర్తించింది. జకీర్ నిర్వహించే ట్రస్టు, ఆయన వ్యక్తిగత ఖాతాల్లోకి కొన్నేళ్లుగా అజ్ఞాత శ్రేయోభిలాషుల నుంచి వేల కోట్లు జమయినట్లు అధికారులు తెలిపారు.

విదేశాల నుంచి విరాళాలు..

జకీర్​ ప్రసంగాలకు ఆకర్షితులై యూఏఈ, సౌది అరేబియా, బహ్రెయిన్​, కువైట్​, ఒమన్​, మలేసియా వంటి దేశాల నుంచి ఆయన శ్రేయోభిలాషులు భారీ నిధులు పంపారు. వివిధ బ్యాంకుల్లో శ్రేయోభిలాషులు అనే పేరుతో డిపాజిట్​ చేసినందువల్ల సొమ్ము ఎవరు పంపారనే వివరాలు గుర్తించలేక పోయినట్లు అధికారులు తెలిపారు.
ఈడీ విచారణను తప్పించుకునేందుకు ప్రస్తుతం మలేసియాలో తలదాచుకుంటున్నారు జకీర్​.

ఇస్లామిక్​ రీసెర్చ్​ ఫౌండేషన్​ (ఐఆర్​ఎఫ్​​) ట్రస్టును ముంబయి కేంద్రంగా నిర్వహిస్తున్నారు జకీర్​. 2003 నుంచి 2017 మధ్య కాలంలో రూ.64.86 కోట్లు ఐఆర్​ఎఫ్​ బ్యాంకు ఖాతాల్లో జమయ్యాయని ఈడీ తెలిపింది.

అక్రమ ఆదాయం..

రూ. 49.20 కోట్లను జకీర్​ తన ఆదాయంలో చూపలేదు. నిబంధనలకు విరుద్ధంగా నిధులు సమకూరినందువల్ల అక్రమ నగదు బదిలీ నియంత్రణ చట్టం (పీఎంఎల్​ఏ) కింద కేసు నమోదు చేసింది ఈడీ. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్​ఐఏ) ఎఫ్​ఐఆర్​ ఆధారంగా జకీర్‌ నాయక్‌పై 2016లో ఈడీ మనీ లాండరింగ్‌ కేసు నమోదు చేసింది. మొత్తం రూ.193.06 కోట్ల అనధికారిక నగదు ఉన్నట్లు అభియోగ పత్రంలో పేర్కొంది.

ఇదీ చూడండి: కేరళపై ఐసిస్ కుట్ర.. యంత్రాంగం అప్రమత్తం

New Delhi, May 25 (ANI): Narendra Modi got elected as the leader of National Democratic Alliance (NDA) at the Parliamentary meeting on Saturday. Modi took blessings from senior BJP leaders LK Advani and Murli Manohar at the NDA meeting. He also touched feet of Shiromani Akali Dal (SAD) leader Parkash Singh Badal. Shiv Sena chief Uddhav Thackeray, Sushma Swaraj and Nitin Gadkari greeted Narendra Modi after he was elected as the leader of NDA.
Last Updated : May 26, 2019, 11:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.